9 మంది కంటెస్టెంట్ లపై ఫైర్ అయిన నాగార్జున.. మీరు బిగ్ బాస్ కి అవసరం లేదంటూ చివాట్లు..?

బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమై ఇప్పటికే రెండు వారాలు పూర్తి అయ్యింది. ఇండియాలో నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్బాస్ రియాలిటీ షో తెలుగులో ప్రారంభమై ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల ప్రారంభమైన సీజన్ సిక్స్ కూడా మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ సీజన్ మొదటి వారంలో ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి కంటెస్టెంట్లను సేవ్ చేశారు. శనివారం జరిగిన ఎపిసోడ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బాగా చివాట్లు పెట్టాడు.

ఈ వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కి సెలెక్ట్ అయ్యారు. వీరిలో అభినయశ్రీ, మెరీనా రోహిత్, షాని, బాల ఆదిత్య, శ్రీ సత్య, కీర్తి ప్రశాంతి, శ్రీహన్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నాగార్జున వీరందరిని సోఫా వెనకాల నిలబెట్టి మిగిలిన వారిని సోఫాలో కూర్చోబెట్టాడు. బిగ్ బాస్ రెండవ వారంలో వీరందరూ తమ పర్ఫార్మెన్స్ కనబడచక పోవడంతో బిగ్ బాస్ వీరందరిని పక్కనపెట్టి వారు చేసిన పొరపాటులను తెలియజేస్తూ ఒక్కొక్కరికి పేరుపేరునా చివాట్లు పెట్టాడు.

ఈ క్రమంలో శ్రీ సత్య, అభినయశ్రీ, ప్రశాంతి వంటి వారు
ఆట ఆడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని శ్రీ సత్య తిండి మీద పెట్టిన ఏకాగ్రత ఆట మీద పెట్టడం లేదని సీరియస్ అయ్యాడు. ఇక షాని తో మాట్లాడుతూ.. ఆట ఆడటానికి అవకాశం దొరకటం లేదని షాని చెప్పటంతో ఎప్పుడైనా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు మనమే అవకాశాల మనమే కల్పించుకోవాలి అని నాగార్జున చివాట్లు పెట్టాడు. ఇక శ్రీహాన్ తో మాట్లాడుతూ అద్దం ముందు గడిపే సమయం ఆట కోసం గడిపితే బాగుంటుందని ఫైర్ అయ్యాడు. తిని పడుకోవటం కోసం బిగ్ బాస్ కి వచ్చినట్లయితే మీరందరూ బిగ్ బాస్ లో ఉండాల్సిన అవసరం లేదని వెంటనే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోండి అంటూ నాగార్జున కంటెస్టెంట్ల మీద చాలా కోపగించుకున్నాడు.