మన భారతీయ సంస్కృతిలో పూజలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఉన్న ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొ దేవుడికి అంకితం చేయబడింది. ఇలా సోమవారం రోజుని పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. అందువల్ల దేశవ్యాప్తంగా ప్రజలందరూ సోమవారం రోజున బోలా శంకరుడిని పూజిస్తూ ఉంటారు. అభిషేక ప్రియుడైన భోళా శంకరుడికి నిత్యం గంగాజలం, పండ్లు పంచామృతాలతో అభిషేకం చేయడమే కాకుండా పండ్లు పరమాన్నం వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టే ఆలయం కూడా ఒకటి ఉంది. పురాణాల ప్రకారం శివుడికి పరమ భక్తుడైన భక్త కన్నప్ప నిత్యం మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అయితే ఇప్పటికీ ఒక ఆలయంలో కొలువై ఉన్న శివుడికి అక్కడి గ్రామస్తులు మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
అంతపురం జిల్లా పెనుగొండలోని మడకశిరలో ఉన్న ఈ ఆలయాన్ని స్వయంభుగా భక్తులే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. 1200 సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించే ప్రజలు వేరే ప్రదేశాలకు వెళ్లి జీవించటం వల్ల ఈ గ్రామం శిథిలం అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి ప్రజలు ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే ఇక్కడ ప్రజలకు శివలింగం ఆంజనేయ స్వామి విగ్రహం మహిషాసుర మర్దిని విగ్రహం లభించడంతో వాటిని స్వయంగా ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. ఎక్కడ ప్రజలు ఈ శివలింగాన్ని నీలకంటేశ్వర స్వామిగా పిలవడం వల్ల ఈ గ్రామానికి నీలకంఠాపురం అని పేరు వచ్చింది.
ఇక ఈ గ్రామంలో ప్రజలు ఇప్పటికీ శివుడికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా శివుడికి మాంసాన్ని సమర్పించి ఏకైక ఆలయం ఇది. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రజలు నిత్యం వస్తుంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి శివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయాన్ని దర్శించి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసం, మాఘ మాసంలో ఈ ఆలయంలోని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.