సాధారణంగా పండగ వేళల్లో కానీ..పవిత్రమైన మాసాలలో కానీ అప్పుడప్పుడు ఆలయంలో ఇంట్లో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక పూజల కోసం అవసరమైన పూజా సామాగ్రిని తక్కువ కాకుండా కొంతవరకు ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ పూజల అనంతరం పూజ సామాగ్రి మిగులుతూ ఉంటుంది. ఇలా మిగిలిన పూజా సామాగ్రిని కొంతమంది దేవాలయాలలో ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది గంగాజలంలో కలుపుతూ ఉంటారు. అయితే పూజలు , హోమాలు నిర్వహించిన తర్వాత మిగిలిన పూజా సామాగ్రిని ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
కుంకుమ :
సాధారణంగా పూజలో కుంకుమ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కుంకుమ లేకుండా చేసే పూజ అసంపూర్ణంగానే ఉంటుంది. ఇలా పూజలో ఉపయోగించిన కుంకుమ మిగిలినట్లయితే దానిని పరవేయకుండా వివాహితులు ఉపయోగించవచ్చు. వివాహితులు ఇలా పూజలు మిగిలిన కుంకుమ ధరించటం వల్ల కూడా శుభం కలుగుతుంది. అంతేకాకుండా ఇలా మిగిలిన కుంకుమను ఇంటికి తెచ్చిన కొత్త వస్తువులను పూజించటానికి కూడా ఉపయోగించవచ్చు.
పువ్వులు :
పువ్వులు లేని పూజ ఎక్కడ ఉండదు. పువ్వులు సమర్పించి పూజ చేసి భగవంతున్ని ఆరాధించటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే ఇలా పూజ కోసం తెచ్చిన పూలు మిగిలినప్పుడు వాటిని మాల కట్టి ఇంటి ముఖద్వారానికి తోరణంల వేయడం వల్ల కూడా శుభం కలుగుతుంది.
అక్షితలు:
పూజలో ఉపయోగించే మరొక ముఖ్యమైన సామాగ్రి అక్షతలు. అన్నంలో పసుపు, కుంకుమ కలిపితే అక్షతే సిద్ధిస్తుంది. పూజ పూర్తయ్యాక మిగిలిన అక్షతలు పారబోయకుండా రోజు మనం వాడే బియ్యంలో కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ఆహారానికి కొదువ ఉండదు.
తమలపాకులు:
పూజలో ఉపయోగించే మరొక ముఖ్యమైన సామాగ్రి తమలపాకు. హిందూ పురాణాల్లో ఈ తమలపాకుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. తమలపాకు లేకుండా చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ పూర్తయిన తర్వాత మిగిలిన తమలపాకులను ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు పెట్టే అలమర లోపల ఉంచటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.