సాధారణంగా నిద్రపోయినప్పుడు అందరికీ తరచు కలలు వస్తూ ఉంటాయి. కొంతమందికి మంచి కలలు వస్తే మరి కొంతమందికి పీడకలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మన భవిష్యత్తులో జరిగే విషయాలు కలల ద్వారా కనిపిస్తాయి. అందువల్ల మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి కళల రూపంలో సంకేతాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మన పూర్వీకులు చనిపోయిన తర్వాత తరచూ కలలో కనిపిస్తూ ఉంటారు. ఇలా పూర్వీకులు తరచూ కలలో కనిపించటం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా చనిపోయిన కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల అప్పుడప్పుడు వారి గురించి కలలు వస్తూ. అలా కాకుండా చనిపోయిన పూర్వీకులు తరచూ కలలో కనిపిస్తూ ఉంటారు. ఇలా పూర్వీకులు తరచూ కలలో కనిపిస్తూ ఉంటే వారి ఆత్మ ఇంకా మన చుట్టూనే తిరుగుతూ ఉంటుందని తెలిపే సంకేతం. అంతేకాకుండా వారు చనిపోయిన తర్వాత కూడా మన నుండి ఏదో ఆశిస్తున్నారని మనం గుర్తించాలి. అందువల్ల ప్రతిరోజు కుటుంబ సభ్యులకు కలలో కనిపిస్తూ ఉంటారు. అలా మన పూర్వీకులు తరచూ కలలో కనిపిస్తూ ఉంటే రామాయణం మహాభారతం వంటి గ్రంథాలను వారి పేరిట చదవాలని పండితులు సూచిస్తున్నారు.
ఇక మన పూర్వీకులు కలలో కనిపించే బాధపడుతూ ఉంటే భవిష్యత్తులో మనకు ఏదో ప్రమాదం జరగబోతుందని తెలిపే సంకేతం. అలాంటి సమయంలో పండితులను సంప్రదించి శాంతి పూజలు జరిపించడం మంచిది. అలాగే కలలో మన పూర్వీకులు మౌనంగా ఉంటే పేదలకు దాన ధర్మాలు చేయాలని అర్థం. మన పూర్వీకులు కలలో కోపంగా ఉన్నట్లు కనిపిస్తే.. వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. వారి కోరికలను తీర్చటం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. ఇలా మన కోరికలు తీరకుండా చనిపోయిన మన పూర్వీకులు తరచూ కలలో కనిపిస్తారు. వారి కోరికలు నెరవేరిన తరువాత వారి ఆత్మ అనంత లోకాలలో కలిసిపోతుంది.