మన హిందూ సాంప్రదాయంలో అనేక పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో ఈ ఆచారాలను పాటించే వారి సంఖ్య మాత్రం తగ్గిపోయింది. మన పెద్దలు చెప్పే ఈ ఆచారాలను పాటించటం వల్ల మంచి జరుగుతుంది. ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రోజున క్షవరం చేపించుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ గజిబిజి ఉరుకులు పరుగుల జీవితంలో వారాలతో సంబంధం లేకుండా సమయం దొరికినప్పుడు హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకుంటూ ఉంటారు.
అయితే ఇలా హెయిర్ కటింగ్ షేవింగ్ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ ఏ రోజులలో హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు? ఏఏ రోజులలో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవటం గెడ్డం తీసుకోవటం వల్ల ఒక మాసపు ఆయుషు తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. దాని ఫలితంగా శరీర ఉస్టోగ్రత అధికమవుతుంది.
• సోమవారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం. సోమవారం రోజున జుట్టు కత్తిరించడం గడ్డం తీసుకోవడం వంటి పనులు చేయటం వల్ల ఏడు మాసముల ఆయుషు పెరిగి సౌఖ్యం కలగజేస్తుంది. అయితే పుత్ర సంతానం కోరుకునేవారు లేక ఏకైక పుత్రుడు కలిగిన వారు సోమవారం రోజున క్షవరం చేయించుకోకూడదు.
• ఇక మంగళవారం రోజున క్షవరం చేయించుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. మంగళవారం రోజున ఇలా చేయటం వల్ల ఎనిమిది నెలల ఆయుష్షు తగ్గిపోతుంది. అంతేకాకుండా జీవితంలో అనేక సమస్యలు ఎదురై దుఃఖమయం అవుతుంది.
• బుధవారం రోజున క్షవరం చేయించుకోవడం మంచిది. ఈ రోజున క్షవరం చేయించుకోవడం వల్ల ఆయువు.
• ఇక గురువారం రోజున క్షవరం చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూసేవారు గురువారం రోజున క్షవరం చేయించుకోకూడదు.
• ఇక శుక్రవారం రోజున చవరం చేయించుకోవటం అస్సలు మంచిది కాదు. శుక్రవారం రోజున చవ్రం చేయించుకోవడం వల్ల పది మాసముల ఆయుష్షు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
• అలాగే శనివారం రోజున కూడా క్షవరం చేయించుకోవడం వల్ల ఆయుషు తగ్గుతుంది.
అందువల్ల కేవలం సోమవారం, బుధవారం, గురువారాల్లో మాత్రమే క్షవరం చేయించుకోవాలి.