ఏ దేవనామస్మరణతో ఏం ఫలితాలో మీకు తెలుసా ?

భక్తులు నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారు. సనాతనధర్మం ప్రకారం ఉఛ్వాశ, నిశ్వాస భగవన్నామ స్మరణ చేయాలని చెప్తుంది. అయితే ఈ దేవుడి నామస్మరణ చేస్తే ఏం ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం…

గణనాయకాష్టకం – అన్ని విజయాలకు !!
ఆదిత్యహృదయం – ఆరోగ్యం , ఉద్యోగం !!
శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది !!
అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి !!
శివాష్టకం – శివ అనుగ్రహం !!
కాలభైరవ అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!
విశ్వనాథ అష్టకం – విద్య విజయం !!
శివషడక్షరి స్తోత్రం – చేయకూడని పాప నాశనం !!
సుబ్రహ్మణ్యం అష్టకం – సర్పదోష నాశనం , పాప నాశనం !!
హనుమాన్ చాలీసా – శని బాధలు , పిశాచపీడ !!
విష్ణు శతనామ స్తోత్రం – పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
దుర్గష్టోత్తర శతనామం – భయహరం !!
భ్రమరాంబిక అష్టకం – సర్వ శుభప్రాప్తి !!
శ్రీలక్ష్మీనరసింహ స్తోత్రం – ఆపదలో సహాయం , పీడ నాశనం !!
శ్రీకృష్ణ అష్టకం – కోటి జన్మపాప నాశనం !!
శ్రీఉమామహేశ్వర స్తోత్రం – భార్యాభర్తల అన్యోన్యత !!
శ్రీ రామరక్ష స్తోత్రం – హనుమాన్ కటాక్షం !!
శ్రీలలిత పంచరత్నం – స్త్రీ కీర్తి !!
శ్యామాల దండకం – వాక్శుద్ధి !!
త్రిపుర సుందరి స్తోత్రం – సర్వజ్ఞాన ప్రాప్తి !!
శివతాండవ స్తోత్రం – రథ గజ తురంగ ప్రాప్తి !!
శని స్తోత్రం – శని పీడ నివారణ !!
అంగారక ఋణ విమోచన స్తోత్రం – ఋణ బాధ నివారణం !!
కార్త్యవీర్యార్జున స్తోత్రం – నష్ట ద్రవ్యలాభం !!
శ్రీకనకధార స్తోత్రం – కనకధారయే !!
శ్రీ సూక్తం – ధన లాభం !!
సూర్య కవచం – సామ్రాజ్యపు సిద్ది !!
సుదర్శన మంత్రం – శత్రు నాశనం !!
విష్ణు సహస్ర నామ స్తోత్రం – ఆశ్వమేధయాగ ఫలం !!
రుద్రకవచం – అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
భువనేశ్వరి కవచం – మనశ్శాంతి , మానసిక బాధలకు !!
శ్రీవారాహి స్తోత్రం – పిశాచ పీడ నివారణకు !!
దత్త స్తోత్రం – పిశాచ పీడ నివారణకు !!
నిత్యము భగవాన్ నామ స్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతారు. మీరు పైన చెప్పిన ఆయా దేవతలను ఆరాధించి ఆయా ఫలితాలను పొందండి.