హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

మనదేశంలో హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. హనుమంతుడి ని ఎక్కువగా మంగళవారం లేదా శనివారాలలో పూజిస్తుంటారు. కానీ మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందువల్ల మంగళవారం రోజున హనుమంతుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి హనుమాన్ చాలీసా పటిస్తే వెంటనే భక్తులను అనుగ్రహిస్తాడు అని ప్రజల నమ్మకం.హనుమాన్ చాలీసా ను పటించడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హనుమాన్ చాలీసా మనసుపెట్టి పటించె వారి కష్టాలను హనుమంతుడు దూరం చేస్తాడు. హనుమాన్ అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. సాధారణంగా పీడకలలు, భూతాలకు భయపడేవారు హనుమాన్ చాలీసా ని పఠిస్తారు. హనుమాన్ చాలీసా ను పటించడం వలన పిడకలలు రాకపోవడమే కాకుండా ధైర్యం పెరిగి దయ్యాల వలన కలిగే భయం పోతుంది అని ప్రజల నమ్మకం. భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా ను పాటించడం వల్ల వ్యాధుల నుండి కూడా విముక్తి పొందవచ్చు. హనుమాన్ చాలీసా పటించడం వలన హనుమంతుడు తన భక్తులకు బలం, జ్ఞానం, తెలివి అందించడంతో పాటు వారి కష్టాలను, దుఃఖాలు దూరం చేస్తాడు అని నమ్మకం.

హనుమాన్ చాలీసా ను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పఠించడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతారు. హనుమాన్ చాలీసా ను పఠించడం వలన ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి. మనసులో బెదురు, భయం పోయి ఎదిరించగలిగే శక్తిని ప్రసాదిస్తాడు. హనుమాన్ చాలీసా ను వంద సార్లు పటించే వ్యక్తి అన్ని బాధల నుండి విముక్తి పొంది గొప్ప ఆనందాన్ని పొందుతాడు. ఇలా ప్రతి రోజూ హనుమాన్ చాలీసా ను పఠించడం మాత్రమె కాకుండా ప్రతి మంగళవారం రోజు హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులతో పూజలు చేయాలి.