హనుమంతుడిని భక్తితో ఇలా పూజిస్తే శనిదోషాలు దూరమవుతాయా.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది ఆంజనేయ స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే. మంగళవారం రోజున ఆంజనేయస్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లు హనుమంతుడిని పూజిస్తే మంచిది. ఓం శ్రీ హనుమతే నమః మంత్రాన్ని జపిస్తూ హనుమంతుడిని పూజిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.

మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా మేలు జరుగుతుంది. హనుమంతుడిని తమలపాకులు లేదా సింధూరంతో పూజించడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శని దోషం కలిగిన వాళ్లు శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజించి వేయించిన శనగ గుగ్గిళ్ళను సమర్పించడం ద్వారా దోషాలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి.

చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఉలిక్కిపడుతూ భయాందోళనకు గురవుతున్నా పిల్లల నుదుట విభూతిని పెడితే మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. హనుమంతుడిని పూజించే సమయంలో కొన్ని నియమాలను, ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. పిల్లలు హనుమాన్ చాలీసా చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. హనుమంతుడిని ప్రతిరోజూ పూజిస్తే శనికి సంబంధించిన దోషాలు దూరమవుతాయి.

ప్రతి ఊరిలో హనుమంతుని ఆలయం ఉంటుంది. వారానికి ఒకసారి అయినా హనుమంతుని ఆలయాన్ని సందర్శిస్తే మంచిది. హనుమంతుడిని పూజించడం వల్ల దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది. హనుమంతుడికి ఇష్టమైన సింధూరాన్ని సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామిని పూజించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.