మంగళవారం రోజున హనుమాన్ చాలీసా చదివితే అదృష్టం కలిసొస్తుందట.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది హనుమంతుడిని ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది. శ్రీ తులసి దాసు హనుమాన్ చాలీసాను రచించగా ఆంజనేయ స్వామి దర్శనం కలిగిన తర్వాత తులసి దాసు హనుమాన్ చాలీసా రాశారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల సమస్త దేవతలను పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితంను పొందవచ్చు,

రోజుకు 11 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచిది. వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణలను హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మంచి జరుగుతుంది. వృద్ధుల వరకు అనేక సమస్యలు, భయాలు ఉండగా హనుమాన్ చాలీసా చదవడం వల్ల మేలు జరుగుతుంది. హనుమాన్‌చాలీసా పారాయణం అత్యంత సులభమైన తంత్రం అని చెప్పవచ్చు.

ప్రతిరోజు ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు, సింధూర ధారణ చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. దేవాలయంలో 21 ప్రదక్షిణలు, ఉపవాస నియమాలు పాటించడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. సుందరకాండ పారాయణం వల్ల సకలకార్య జయం, కుటుంబ సంతోషం, సంతానవృద్ధి విషయంలో ప్రయోజనం చేకూరుతుంది. మూడు, ఏడు రోజుల పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి.

ఎప్పుడైనా భయం కలిగితే ఆంజనేయ దండకాన్ని చదవడం మంచిది. మాటలు వచ్చిన పిల్లలకు అయితే ఆంజనేయదండకాన్ని నేర్పించడం ద్వారా సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. హనుమాన్ చాలీసాను చదవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.