ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమ అనేది వారి మనసులో చిగురిస్తుంది. ఇలా ప్రేమలో పడినవారు ఈ లోకంలో లేని విధంగా ప్రేమలో మునిగి తేలుతుంటారు.అయితే కొన్నిసార్లు మితిమీరిన ప్రేమ ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని చెప్పాలి.బాధలు వచ్చినప్పుడు ఆ బాధలను పంచుకోవడానికి మనకంటూ ఒకరు ఉండాలనిపిస్తుంది అయితే అదే ప్రేమను మనం ఎవరిపైనైనా ఎక్కువగా చూపించినప్పుడు లేనిపోని సమస్యలు కూడా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మితిమీరిన ప్రేమలో నుంచి మిమ్మల్ని బయటపడేసే అద్భుతమైన మార్గాలు ఇవే.
నిపుణుల అభిప్రాయం ప్రకారం మితిమీరిన ప్రేమ కూడా ఒక సమస్య అని అంటున్నారు. పిచ్చి ప్రేమ ఒక అబ్సెసివ్ లవ్ డిజార్డర్. దీని వల్ల ఒకరి ప్రేమ వల్ల ఒకరు ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. అవసరానికి మించి పార్ట్ నర్ గుర్తుకు వస్తుంటే అది డిజార్డర్ అని అర్థం అట. దీని వల్ల ప్రేమని చూపుతున్నవారు,ఫేస్ చేస్తున్నవారు కూడా ఇబ్బందులకు గురి అవతారని నిపుణులు చెబుతున్నారు.ఒక వ్యక్తిపై చూపించాల్సిన దానికన్నా అతిగా ప్రేమ చూపిస్తే మనం చేయాల్సిన పనిపై ఏ మాత్రం దృష్టి ఉండదని మన వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
అందుకే ఈ విధంగా ప్రేమను వ్యక్తపరిచే వారు వారిపై ఉన్నటువంటి ప్రేమను కాస్త తగ్గించుకొని దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రతిరోజు కలవడం మానుకొని వారానికి ఒకసారిమీ ప్రియుడిని కలవడం వంటివి చేయాలి ఇక కుటుంబ సభ్యులను కూడా వారానికి ఒకసారి బయటకు తీసుకెళ్లడం లేదా మీరే ఒకరోజు ఇంట్లో కూర్చుని వారితో సమయం గడపడం చేయాలి. అంతేకానీ సమయం దొరికినప్పుడల్లా, కొన్నిసార్లు పనులు మానుకొని మీరు ప్రేమించే వారితో సమయం గడపకూడదని ఇలా గడపడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.