తులసి మాల ధరించటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా…?

హిందూ పురాణాల ప్రకారం తులసి చెట్టుకు ఒక పవిత్రమైన స్థానం ఉంది. ప్రతిరోజు ఇంట్లో దేవుడితో పాటు తులసి చెట్టును కూడా పూజించటం వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించవచ్చు. మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ఈ తులసి ఆకులతో ఆ మహావిష్ణువుని పూజించటం వల్ల ఆ మహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చు. అంతేకాకుండా తులసి ఆకుల వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అందువల్ల ఎన్నో దశాబ్దాల కాలం నుండి తులసి ఆకులను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం కొన్ని తులసి ఆకులను నెమలి తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ తులసిలో రామ తులసి, శ్యామ తులసి అని రెండు రకాలు ఉంటాయి. ఇలా ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులు తినటమే కాకుండా తులసి మాల ధరించటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తులసి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్య సమస్యలు:

తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఉదయం 3 లేదా నాలుగు తులసి ఆకులు తినటం లేదా తులసిమాలను ధరించటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. తులసి మాల ధరించడం వల్ల అంటువ్యాధులు సంక్రమించకపోవడమే కాకుండా అకాల మరణాలు కూడా ఎదురు కావని నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణశక్తిని పెంచుతుంది:

తులసి ఆకులు తినటం లేదా తులసి మాల ధరించడం వల్ల వ్యక్తి జీర్ణ శక్తి మెరుగుపడేటమే కాకుండా జ్వరం, మెదడు వ్యాధులు వంటి వాటి నుండి విముక్తి పొందవచ్చు.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది:

రామ తులసి జపమాల ధరించడం వల్ల మనిషి లో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జపమాల వ్యక్తిలో సాత్విక భావాలు మేల్కొల్పుతాయి. ఇది మీ విధులను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

భక్తిని పెంచుతుంది:

శ్యామ తులసి మాల ధరించడం వల్ల మనిషి జీవితంలో మానసిక ప్రశాంత పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జపమాల ధరించటం వల్ల భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు కూడా పెరుగుతాయి. మనసులో ఉండే సానుకూల భావోద్వేగాలు ఆధ్యాత్మిక పురోభివృద్ధి తో చేకూరుతుంది.