ప్రతి ఇంట్లో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇంట్లో తులసి చెట్టు ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు. తులసిలో ఎన్నో గొప్ప గుణాలు ఉండగా కఫం, జ్వరం జబ్బులు వచ్చినప్పుడు తులసి దివ్యౌషధంలా పని చేస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పరగడుపున ఎవరైతే తులసిని తీసుకుంటారో వాళ్లకు ఆరోగ్య పరంగా చాలా మేలు జరుగుతుంది.
మొటిమలు, దద్దుర్లు సమస్యలతో బాధ పడేవాళ్లు తులసి నూనెను అద్భుతమైన స్కిన్ టోనర్ గా ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా తులసి నూనె సహాయపడుతుందని చెప్పవచ్చు. తులసి ఆకులని నమిలి తీసుకోవడం ద్వారా దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడటానికి తులసిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు.
వేడినీటిలో తులసి ఆకులను వేయడం ద్వారా సులువుగా తులసి టీ తయారు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 5, 10 నిమిషాలు ఉడకబెట్టి చల్లబరిచి టీ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆర్థరైటిస్ నొప్పి, వాపుని తగ్గించడంలో తులసిలోని యాజినాల్ ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వుని కరిగించి బరువుని తగ్గించడంలో యూజినాల్ తోడ్పడుతుంది.
శరీరంలో అలర్జీ లక్షణాలను తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది. యూజీనళ్ అనే సమ్మేళనం మానసిక స్థితిని మెరుగుపరచడంలో విశ్వాసాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఊపిరితిత్తులని క్లియర్ చేసి ఉబ్బసం సమస్యకు సైతం చెక్ పెడతాయి. తులసిలో ఉండే యూజీనాల్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా శరీరాన్ని రక్షిస్తాయి. క్యాన్సర్, గుండెజబ్బులు వంటి సమస్యలకి ఇవి కారణమవుతాయి. యూజినాల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి హృదయ స్పందన రేటుని కంట్రోల్ చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది తోడ్పడుతుంది. తులసిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు సైతం దూరమవుతాయని చెప్పవచ్చు.