మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. అందువల్ల ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటిస్తూ ఇంటి నిర్మాణం చేపడతారు. వాస్తు నియమాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ఇంట్లో ఉంచి వస్తువులను కూడా వాస్తు ప్రకారం అమర్చుకుంటారు. ఎందుకంటే వాస్తు నియమాలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేపట్టిన లేదా ఇంట్లో వస్తువులు ఉన్నా కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతి ఇంట్లో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
అయితే వాస నియమాల ప్రకారం ఏంటి నిర్మించుకున్నా కూడా కొన్ని సందర్భాలలో ఇంట్లో ఉన్న వస్తువుల వల్ల కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది. ఈ వాస్తు దోషం వల్ల కూడా కుటుంబ సభ్యులు అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు ఇంటి పైకప్పు మీద ఉన్న వస్తువుల వల్ల కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది. సాధారణంగా ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఇంటి పైకప్పు మీద ఉంచుతూ ఉంటారు. ఇలా ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను బయటపడేయకుండా ఇంటి పైకప్పు మీద ఉంచటం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది.
ఇంట్లో ఉన్న చెత్తాచెదారం ఇంటి పైకప్పు మీద ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. అందువల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడి మనశ్శాంతి కోల్పోతారు. ఇలా వాస్తు దోషం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలతో సతమతమవుతున్న వారు ఇంటి పైకప్పు మీద ఉన్న వస్తువులను వెంటనే తొలగించాలి. వాటికి బదులు అందమైన మొక్కలు నాటడం వల్ల వాస్తు దోషం తొలగిపోవడమే కాకుండా ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి అన్యోన్యంగా ఉంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.