మన హిందూ సాంప్రదాయంలో పూజా కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అందువల్ల ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించటం వల్ల లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం. అయితే శుక్రవారం రోజు మహిళలు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. దీంతో ఆ కుటుంబం లో ఉన్న సంపద మొత్తం పోయి ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. శుక్రవారం రోజున మహిళలు చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాం.
• శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందువల్ల శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపటం ఇంటిని శుభ్రం చేయటం వంటి పనులు చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది.
• అలాగే శుక్రవారం రోజున పూజగదిని శుభ్రం చేసిన ఆ గదిలో ఉన్న చెత్త, పాత వస్తువులు కూడా బయట పడేయరాదు.
• అలాగే పాత సమన్లు, పాత దుస్తులు, ఉప్పు, డబ్బు వంటివి శుక్రవారం రోజున ఎవ్వరికి దానం చేయరాదు. అలా చేయడం వల్ల ఇంట్లో సంపద వెళ్లిపోతుంది.
• అలాగే శుక్రవారం రోజు మహిళలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు.
• అలాగే పసుపు, కుంకుమని పొరపాటున కూడ జార విడచకూడదు. ఆరోజు కుంకుమ కింద పడితే చాలా అరిష్టం.
• అలాగే శుక్రవారం రోజున దేవుడి ముందు ఇంటి తలుపుకు, గుమ్మానికి వాడిపోయిన పువ్వులు ఉండరాదు.
• అలాగే శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు. అలా చేస్తే సంపద హరించుకుపోతుంది. మహిళలు కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే తల స్నానం చేయాలి.
• అదేవిధంగా శుక్రవారం ఆడు ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళరాదు.
• అలాగే శుక్రవారం మహిళలు కంటతడి పెట్ట కూడదు. అలా కంట తడి పెడితే ఆ ఇంటికి చాలా అరిష్టం.