లక్ష్మీదేవి సంపదలకు అధిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్ని లభించినట్లే. అయితే వీటికోసం పెద్దలు చెప్పిన పరిహారాలు చూద్దాం… ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి ప్రీతికలిగేలా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీకి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి.
పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి.
ఇది తప్పనిసరిగా చెయ్యాల్సిన పని. ఎందుకంటే స్మశానం ముందున ముగ్గు వెయ్యరు. కనుక ఇంటి ముందు శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒకరకం పువ్వులు పెడితే మంచిది. గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె
గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.
గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో 5 రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి.
ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది