మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి ప్రజలు దేవుళ్ళ తో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు. అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీమహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అందువల్ల శ్రీమహావిష్ణువు పూజలో తులసిని ఉపయోగిస్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీ సమేత లభించి సిరిసంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. అంతేకాకుండా తులసి మొక్కని ఇంట్లో ఉంచి పూజించటం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి? ఏ విధంగా పూజించాలి? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య(తూర్పు దిశ) దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే పొరపాటున కూడా తులసి మొక్కను దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు. పొరపాటున ఆ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా కలహాలు ఏర్పడతాయి.
అలాగే ముళ్ల పొదలకు దగ్గర్లో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అయితే అరటి చెట్టుకు దగ్గర్లో తులసి మొక్క ని నాటొచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లు భావిస్తారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కకి ప్రతిరోజు పూజలు చేయడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు అలాగే.. పూజలు కూడా చేయకూడదు. అసలు ఆదివారం రోజున తులసి మొక్కను కనీసం తాకకూడదు. అలాగే సూర్య, చంద్ర గ్రహణం రోజున, సోమవారం, బుధవారం, ఆదివారం రోజున, ఏకాదశి తిథి వేళ కూడా తులసి మొక్కను కనీసం తాకకూడదు అని కూడా పండితులు చెబుతారు.