సాధారణంగా మనం ఇతర సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతామో ఈ క్రమంలోనే మన ఇంట్లో చిన్న అలంకరణ వస్తువు నుంచి మొదలుకొని ఏదైనా పనిచేస్తున్నప్పటి వరకు ప్రతిదీ వాస్తు శాస్త్రం ప్రకారం చేస్తాము.ఇలా చాలామంది వారి దినచర్యలో వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో విశ్వసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనం పడుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ వస్తువులను దిండు కింద పెట్టుకొని పడుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే…
చాలామంది పడుకునే సమయంలో వారి ప్యాంట్ జోబులో ఉన్నటువంటి పర్స్ తీసి దిండు కింద పెట్టి నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయటం వల్ల మన పర్స్ మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.పర్సులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అలాంటి పర్స్ ను దిండు కింద పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై మన దగ్గర డబ్బు నిల్వ ఉండదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందుకే దిండు కింద ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా చాలామంది రాత్రిపూట చదువుతూ అలాగే పుస్తకాలను దిండు కింద పెట్టుకొని నిద్రపోతారు. ఇలా పుస్తకాలను తల దిండు కింద పెట్టుకొని నిద్రపోవడం వల్ల మన ఇంట్లోకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా మనం చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. అందుకే పుస్తకాలను కూడా దిండు కింద పెట్టుకోకూడదు.మరి కొంతమంది చేతి వాచీలను తీసి దిండు కింద పెట్టుకునే నిద్రపోతారు. ఇది కూడా చేయకూడదు. ఇలా తల కింద వాచి పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఎలక్ట్రానిక్ వాచ్ లను వాడటం వల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ మనకు ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది కనుక దిండు కింద ఈ వస్తువులను పెట్టి అసలు నిద్రపోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.