కాకికే పిండం ఎందుకు పెట్టాలో తెలుసా.. గరుడ పురాణంలో ఏముందంటే?

బలగం సినిమా విడుదలైన తర్వాత కాకులకు పిండం పెట్టే ఆచారం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చర్చ జరుగుతోంది. పిండం కాకికే ఎందుకు పెట్టాలి? కాకి పిండం తినకపోతే ఏమవుతుంది? అనే చర్చ కూడా జరుగుతుండగా కాకి పిండం తినకపోతే పితృ దోషమని చాలామంది భావిస్తారు. కాకి పిండం తింటే మంచిదని శుభం జరుగుతుందని చాలామంది భావిస్తారు. తినకపోతే దోషమని కొంతమంది భావించడం జరుగుతూంది.

అయితే కాకి పిండం తినకపోయినంత మాత్రాన నెగిటివ్ గా జరుగుతుందని ఎక్కడా ప్రూవ్ కాలేదు. కాకిని బలి భుక్కు అని కూడా పిలుస్తారు. బలి భుక్కు అనగా బలులను భుజించే పక్షి అని అర్థం వస్తుంది. ఎక్కువ సంవత్సరాలు జీవించే పక్షకులలో కాకి కూడా ఒకటి. కాకి కన్నులలో ఒక కన్ను పితృ దేవతలకు నివాసం అని అందరూ భావిస్తారు. పిండి ప్రధాన సమయంలో కాకి చూసినా పితృ దేవతల అనుగ్రహం ఉంటుందని చాలామంది భావించడం జరుగుతుంది.

పిండ ప్రధానం విషయంలో ప్రాంతాలను బట్టి వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనిషి చనిపోయిన పదో రోజు, పదకొండో రోజు పిండం పెట్టడం జరుగుతుంది. కాకికి యముడు ఈ వరాన్ని ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. పితృ దేవతలకు ఆహారం అందించడం కోసం పక్షి జాతికి భోజనం పెట్టడం జరుగుతుంది. పక్షి రూపంలో చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆహారం తింటుందని పెద్దలు విశ్వసిస్తారు.

రాముడు సైతం పూర్వీకులకు కాకులకు పెట్టే ఆహారం చేరుతుందని వరం ఇచ్చాడు. ఈ వరం వల్ల కూడా కాకుల విషయంలో ఈ విధంగా జరుగుతుందని చాలామంది నమ్ముతారు. కాకులకు ఆహారం విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.