దేవుడికి షోడశోపచార పూజలు అనేవి చాలా ముఖ్యం. వీటిలో నైవేద్యం మరి కీలకం. అయితే సాధారణంగా ..ముఖ్యమైన పండుగలు.. వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి సమయంలో బయట కొనుగోలు చేసిన తీపి పదార్ధాలు దేవునికి నివేదన చేస్తుంటారు.. ఇలా బయట కోనేవి నివేదన చేసే బదులు కొబ్బరి కాయ, అరటి పళ్ళు, దానిమ్మ, జామకాయలు వంటి పండ్లు, ఫలాలు నివేదించడం మంచిది.
ఎందుకంటే దేవునికి నివేదించే పదార్ధాలు శుచి, శుభ్రంగా మడి బట్టలు కట్టుకొని వండి నివేదించాలి. నిలువ వున్న తీపి పదార్ధాలు నివేదించ కూడదు.. పర్వ దినాలలో దేవునికి పటిక బెల్లం నివేదించి ఆ పొడి ని తీపి పదార్ధాలపై జల్లి తీపి పదార్ధాలు పంచడం మంచిది. సాధ్యమైనంత వరకు ఏ పదార్థమైన శుచితో, శుభ్రతతో మనకు ఉన్న శక్తిమేరకు ఇంట్లోనే చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల అనేక శుభాలు, ఆరోగ్యం లభిస్తుంది.