మన హిందూ ధర్మంలో వారం రోజులపాటు ప్రతిరోజు ఒక్కో దేవుని పూజిస్తూ ఉంటారు. దేవుని పూజించడం వల్ల కష్టసుఖాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని ప్రజల నమ్మకం. అందువల్ల ఆలయాలకు వెళ్లి దేవుళ్లను పూజించడమే కాకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో కూడా దేవుడి ఫోటోలకు విగ్రహాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఇంటి పూజ గదిలో శనీశ్వరుడి విగ్రహం తప్ప మిగిలిన అన్ని దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శని దేవున్ని ఇంట్లో ఉంచి పూజించకపోవటానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రజల మీద శని దేవుడి దృష్టి పడితే వారి జీవితంలో సమస్యలు మొదలవుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల శని దేవుడి దృష్టి ఇంటి మీద.. ఇంటి సభ్యుల మీద పడకుండా శని దేవుడిని విగ్రహాలను ఇంట్లో ఉంచి ఆరాధించరు. అయితే చాలామంది ప్రజలు ఆ శని దేవుడి అనుగ్రహం కోసం శనిదేవుడికి ఎన్నో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ అలాంటి పూజలన్నీ కేవలం దేవాలయాలలో మాత్రమే నిర్వహించాలి. పొరపాటున కూడా శని దేవుడిని ఇంట్లోంచి ఆరాధించడం వల్ల శని దేవుడి దృష్టి కుటుంబం మీద పడి కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి.
ఇక దేవాలయాలలో కూడా శని దేవుడిని ఆరాధించేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా వ్యక్తి జాతకంలో ఉన్న దోషాల నివారణకై శని దేవుడికి అభిషేకాలు చేస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో శనిదేవుని చూడకుండా ఆయన పాదాల వైపు చూస్తూ పూజ చేయాలి. సాధారణంగా గుడికి వెళితే దేవుడి ముందు తలవంచి లేదా శాస్త్రంగా నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే శనిదేవుని నమస్కరించేటప్పుడు పొరపాటున కూడా తలవంచి నమస్కరించకూడదు. అలాగే శని దేవుని నమస్కరించిన తర్వాత దేవుడి వైపు వీపు చూపించే ఆలయంలో నుంచి బయటికి రాకూడదు. పొరపాటున ఇలా చేయటం వల్ల ఆ శని దేవుడి దృష్టి మనపై పడి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.