ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా విలువ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అయితే ఎంత కష్టపడి పని చేసినా కూడా కొంతమంది డబ్బు సంపాదించలేకపోతున్నారు. అలాగే మరి కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చవుతుంది ఉంటుంది. అందువల్ల అత్యవసర సమయాలలో ఇతరుల వద్ద అప్పు చేస్తూ ఉంటారు. రోజు రోజుకి అప్పులు పెరిగిపోయి అప్పుల బాధతో సతమతమవుతూ ఉంటారు. అప్పుల బాధ నుండి విముక్తి పొందటానికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే ఇంట్లోని పూజ గదిలో ఈ ఐదు వస్తువులను తప్పనిసరిగా ఉంచాలి.
ఓం :
పూజగదిలో కుంకుమ లేదా చందనంతో ఓం చిహ్నాన్ని ఉంచడం శుభసూచకంగా భావిస్తారు. ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఓం అని పఠించడం వల్ల జీవితానికి బలాన్ని ఇస్తుంది. అంతే కాకుండా ఎన్నో రకాల సమస్యలు, వ్యాధులను నాశనం చేసే శక్తికి ఓంకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఓం చిహ్నాన్ని పూజ గదిలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశించి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
స్వస్తిక :
స్వస్తిక్ గుర్తుని శుభానికి ప్రతీకగా భావిస్తారు. స్వస్తిక చిహ్నం హిందూమతంలో అత్యంత పవిత్రమైంది. అందువల్ల పూజ గదిలో పసుపుతో స్వస్తిక్ గుర్తు గీయడం వల్ల ఆ ఇంట్లో శాంతి, సంతోషాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
శ్రీ , మంగళ కలశం :
కలశం లక్ష్మీదేవికి ప్రతీక. అందువల్ల ప్రతి ఒక్కరూ పూజ గదిలో కలశాన్ని ఉంచి పూజిస్తారు. పూజ గదిలో కలశం ఉంచటం శుభప్రదంగా భావిస్తారు. అంగారక కలశం ఆనందానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్ల పూజ గదిలో కలిశాం ఉంచి ప్రతిరోజు పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
లక్ష్మీదేవి పాదాలు, ఆవు డెక్కలు :
పూజగదిలో లక్ష్మీదేవి పాదముద్రలు, ఆవుడెక్కలు ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పూజ గదిలో ఈ రెండు గుర్తులు ఉంచి ప్రతిరోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని ప్రజల విశ్వాసం.
కమలం
ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించి పూజ చేయాలి. తామరపువ్వు శ్రీ హరి, లక్ష్మీదేవికి చిహ్నం. అష్ట కమల పుష్పాన్ని లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల ఆ దేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయి.