మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కి ప్రతిరూపంగా భావించి ప్రతిరోజు తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంపదకు ప్రతీకగా ఉండే లక్ష్మి నారాయణ లను తులసి ఆకులతో పూజించటం వల్ల వారి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సిరిసంపదలు తులుతూవుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ తులసి మొక్కకు నియమనిష్టలతో పూజలు చేస్తూ ఆ తులసీమాత అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతుంటారు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్క ఎదుట నెయ్యి తో దీపం వెలిగించి పూజించటం వల్ల మనం చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. తులసి ఆకులను మాలగా చేసి ఆ మహావిష్ణువును ఆరాధించటం వల్ల విష్ణువు అనుగ్రహంతో సిరిసంపదలు కలుగుతాయి. తులసి మొక్కను పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా తులసి మొక్క మాత్రమే కాకుండా తులసి మొక్క వేర్ల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం అనుకున్న పనులు నెరవేరక పోవటం వల్ల ఎంతో బాధపడుతూ ఉంటాము.
ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న పనులు నెరవేరక ఇబ్బంది పడుతున్న సమయంలో 2 నుండి 3 ప్రాంతాల పొడవు గల తులసి మొక్క వేరును తీసుకొని దానిని గంగాజలంతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆ తులసి వేరకు నిష్టతో పూజ చేసి ఒక తెల్లటి వస్త్రానికి పసుపు పూసి ఈ తులసి వేరును ఆ వస్త్రంలో కట్టాలి. ఈ వస్త్రాన్ని మనం బయటికి వెళ్లేటప్పుడు మనతోపాటు తీసుకువెళ్లడం వల్ల మనం అనుకున్న పని ఏ ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవుతుంది. అలాగే తులసి మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో తులసి మొక్కను ఉపయోగించి అనేకం వ్యాధులకు మందు కనిపెట్టారు.