దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా.. అయితే ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి..?

సాధారణంగా ప్రతి ఒక్కరూ అలంకరణ కోసం నగలు ఎలా ఉపయోగిస్తారో..ఉంగరాలు కూడా అలంకరణ కోసం ఉపయోగిస్తారు. కొంతమంది వివిధ రకాల డిజైన్లతో ఉన్న ఉంగరాలను ధరిస్తే మరి కొంతమంది జాతకం ప్రకారం వివిధ రకాల రంగురాళ్లు ఉన్న ఉంగరాలను ధరిస్తారు. అలాగే మరి కొంతమంది తమ ఇష్టదైవాలకు సంబంధించిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అయితే దేవుడి ప్రథమతో ఉన్న ఉంగరాలను ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అలా నియమాలు పాటించని యెడల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేటప్పుడు దేవుడి తల ఎటువైపు ఉండాలి? కాళ్లు ఎటువైపు ఉండేలా ధరించాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడి కాళ్ళు మనికట్టు వైపు, దేవుడి తల వేళ్ళ గొర్ల వైపు ఉండేలా ఉంగరం ధరించాలి. ఇలా ధరించటానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే మన చేతి వేళ్ళు ఎప్పుడు భూమిని చూస్తూ ఉంటాయి కాబట్టి ఉంగరాన్ని అలా ధరించాలి. అలాగే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించినప్పుడు ఉదయం లేవగానే వాటిని కళ్ళకు అద్దుకుంటారు. అలాంటి సమయంలో మన చేతిని ముడిచి ఉంగరాన్ని కళ్ళకు అద్దుకోవాలి.

అలాగే మహిళలు ఇలాంటి ఉంగరాలను ధరించినప్పుడు నెలసరి సమయంలో వాటిని తీసి పక్కన పెట్టాలి. అలాగే మాంసాహారం తింటున్న సమయంలో కూడా ఇలా దేవుడి ప్రతిమ ఉంగరాలను ధరించకూడదు. ఇలా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడమే కాకుండా మెడలో కూడా దేవుడి ప్రతిమ ఉన్న లాకెట్లు ధరిస్తూ ఉంటారు. వారు కూడా ఇలాంటి మాంసం మద్యపానం సేవించకూడదు. ఇక మహిళలు కూడా నెలసరి సమయంలో దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు లాకెట్లు, తీసి పక్కన పెట్టాలి.