మన దేశంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక మనిషి జీవితంలో జరిగే మంచి చెడులకు కారణమైన వాటి గురించి వాస్తు శాస్త్రంలో వివరించబడింది. కష్టపడి పనిచేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. వాస్తు ప్రకారం, నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడంవల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి పడుకునే ముందు ఎలాంటి పనులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక్కడ తెలుసుకుందాం…
మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు మన ఇంట్లో ఉండే ప్రతికూల అనుకూల పరిస్థితులకు కారణం అవుతుంది. కొన్ని సందర్భాలలో మనం తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. ఈ క్రమంలో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇంట్లో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను పూర్తిగా తొలగించవచ్చు. అందుకోసం ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో ఒక బకెట్ లో నీళ్లు నింపి వంటగదిలో ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మన బాత్రూంలో ఉన్న బకెట్లో ప్రతిరోజు రాత్రి నిండుగా నీటితో నింపి ఉంచాలి లేదంటే ఖాళీ బకెట్ ని అలాగే పెట్టకుండా బకెట్ బోర్ల వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి కలగడమే కాకుండా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే ప్రతి రోజు సాయంత్రం ఇంట్లో దీపం తప్పకుండ వెలిగించాలి. అదేవిధంగా ఇంటి ప్రధాన గుమ్మం మీద ఉన్నటువంటి లైట్ సాయంత్రం వెలుగుతూ ఉండాలి. ఇలాంటి చిన్న వాస్తు నియమాలు పాటించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు.