ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా…. సమస్యల నుంచి బయటపడాలంటే ఇలా చేయండి?

ప్రపంచంలో అందరూ కూడా మంచి గౌరవప్రదమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని భావిస్తారు. ఇలా సంతోషమైన జీవితం గడపడం కోసం ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ వారి దగ్గర డబ్బు నిలబడదు.ఇలా చేతిలో డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు.ఇలా హార్దిక సంస్థలతో ఇబ్బంది పడేవారు కొన్ని వాస్తు నియమాలను పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. సంపదకు ప్రతిరూపం అయినటువంటి లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండక పోవడం వలన పేదరికం వస్తూ ఉంటుందని భావిస్తూ ఉంటారు. కానీ ఈ పేదరికం నుంచి కూడా మనం బయటపడొచ్చు. దానికోసం కొన్ని పనులను మొదలు పెట్టడం వలన పేదరికం నుంచి బయట పడవచ్చు

లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే ఎప్పటికప్పుడు వంటగదిని,ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉండడం వలన లక్ష్మి దేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేకాకుండా సాయంత్రం వేళ నందు పుల్లటి ఆహార పదార్థాలను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. ఉప్పు మరియు పసుపు వంటి వాటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా ఎవరికీ ఇవ్వకపోవడమే చాలా మంచిది. శుక్రవారం వేళల్లో డబ్బును అప్పుగా ఎవరికీ ఇవ్వకపోవడమే మంచిది.

అలాగే ప్రతిరోజు ఇంటిలో పూజలను చేసుకోవడం వలన ఇంటి నందు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన మంచి ఆలోచనలు కలుగుతూ మంచి పనులను చేయడానికి ఉపయోగపడుతుంది. అందరితో సంతోషంగా గడపడానికి కూడా ఉపయోగపడుతుంది. మద్యపానం,ధూమపానాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడకుండా కష్టపడి పనులను చేసుకోవడం వల్ల కూడా పేదరికం నుంచి బయట పడవచ్చును.