ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా… పౌర్ణమి రోజు రాత్రి ఇలా చేస్తే చాలు!

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఉండడం సర్వసాధారణం అయితే మనం ఎంత కష్టపడినప్పటికీ చేతిలో డబ్బు నిలవకుండా కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇలా కష్టపడి సంపాదించినప్పటికీ చేతిలో ఒక్క రూపాయి మిగలకుండా ఆర్థిక ఇబ్బందులు చుట్టూ ముడుతో సతమతమవుతున్న వారు శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే శుక్రవారం అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.

శుక్రవారం సూర్యాస్తమ సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలాగే అమ్మవారికి ప్రత్యేక పువ్వులతో అలంకరించి పూజించాలి. ఆవు పాలు బెల్లం తో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అనంతరం రాగితో తయారుచేసిన శ్రీ యంత్రాన్ని పూజలో ఉంచుకొని పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇక లక్ష్మి దేవితో పాటు సంపదకు మూలకారకుడైన కుబేరుడిని కూడా పూజించడం ఎంతో మంచిది.

ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇంట్లో కుబేర చిత్రపటంతో పాటు కుబేర యంత్రాన్ని కూడా పూజించవచ్చు అలాగే వ్యాపారాలలో అభివృద్ధి సాధించాలంటే వ్యాపారాలు చేసే చోట కుబేర యంత్రాన్ని అలాగే లక్ష్మి కుబేరులు ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజించడం మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే ప్రదీప్ పౌర్ణమి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామాలను చదవటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని చెప్పాలి.