సాధారణంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాలలో కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మరికొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల అనేక నష్టాలు కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇంట్లో మొక్కలను పెంచేటప్పుడు కూడా వాస్తు నియమాలను పాటిస్తూ మొక్కలను నాటుకోవాలి. మనకు తెలియకుండా ఇంట్లో పెంచుకొని కొన్ని రకాల మొక్కల వల్ల ఇంట్లో చెడు పరిణామాలు సంభవిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఏ మొక్కలను ఇంటి పరిసర ప్రాంతాలలో పెంచుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాలలో పెంచకూడని మొక్కలలో కాక్టాస్ మొక్క కూడా ఒకటి. సాధారణంగా ఈ మొక్కలను ఇంట్లో అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. కానీ ఈ మొక్కను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావటమే కాకుండా అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి.
అలాగే ఇంటి ఆవరణలో తుమ్మ చెట్టు పెరగకుండా చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలలో తుమ్మ చెట్టు పెరగటం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తటమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు.
అలాగే రేగు చెట్లను కూడా ఇంటి పరిసర ప్రాంతాలలో పెరగకుండా చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో రేగు చెట్టు ఉంటే ఆ కుటుంబంలో కష్టాలు. రేగు చెట్టులో ఉండే ముళ్ళు కారణంగా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంటి పరిసర ప్రాంతాలలో రేగు చెట్లు ఉండటం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. దీంతో ఆ కుటుంబంలో సభ్యులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. అంతేకాకుండా మనం చేపట్టిన పనులలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి.