బెడ్ రూమ్లో అటాచ్డ్ బాత్రూం నిర్మిస్తున్నారా… ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి!

సాధారణంగా మన భారతీయులు సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగా నమ్ముతారో వాస్తు శాస్త్రాన్ని కూడా అంతగా నమ్ముతారు. ఇలా వాస్తు శాస్త్రానికి అనుగుణంగా మనం చేసే పనులను కూడా నిర్వహిస్తూ ఉంటారు.ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించే దగ్గర నుంచి మొదలుకొని ఇంటిలో అలంకరించే ప్రతి చిన్న వస్తువుని కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.ఇలా ఇంటి నిర్మాణంలో కానీ ఇంటిలో అలంకరించుకొని వస్తువులు కానీ వాస్తు శాస్త్ర ప్రకారం లేకపోవటం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని తద్వారా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాలి.

ఈ విధంగా.ఇంట్లో ఉన్నటువంటి సభ్యులపై ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటానికి వాస్తు దోషాలే కారణమని చెబుతుంటారు అందుకే ఇంటి నిర్మాణ విషయంలో కానీ ఇంటి అలంకరణ విషయంలో కానీ తప్పనిసరిగా వాస్తు పాటించడం ఎంతో మంచిది.ఇకపోతే ప్రస్తుత కాలంలో చాలామంది వారి అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వారి బెడ్ రూమ్ కి అటాచ్డ్ బాత్రూం నిర్మించడం జరుగుతుంది. ఇలా అటాచ్డ్ బాత్రూం ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించడం వల్ల వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది.

బెడ్ రూమ్లో నిర్మించే బాత్రూం ఎప్పుడూ కూడా సరైన దిశలో ఉండాలి. పొరపాటున కూడా మనం నిద్రపోయే సమయంలో మన పాదాల వైపు బాత్రూం ఉండకూడదు.ఇలా ఉంటే ఆ ప్రభావం భార్యాభర్తల దాంపత్య జీవితం పై పడుతుంది. అలాగే మనం నిద్రపోతున్న సమయంలో తప్పనిసరిగా బాత్రూం తలుపులు మూసి ఉండాలి. అటాచ్డ్ బాత్రూమ్ ల వల్ల ఇంట్లో అప్పుడప్పుడు వాస్తు దోషాలు ఏర్పడుతాయి. ఇలాంటి దోషాల నివారణకు ఒక గాజు పాత్రలో ఉప్పు నింపి బాత్రూమ్ లో ఒక మూలన పెట్టాలి. ఈ ఉప్పును వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.