పక్షులను పంజరంలో బంధించి పెంచుతున్నారా… ఈ ఇబ్బందులు తప్పవు?

ప్రస్తుత కాలంలో చాలామంది పెంపుడు జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే కుక్కలు లేదా పిల్లిలను తెచ్చుకొని ఇంట్లో ఎంతో అపురూపంగా చూసుకుంటారు.ఇలా పెంపుడు జంతువులను పెంచిన విధంగానే పక్షులను కూడా చాలామంది పెంచడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే వారికి ఇష్టమైన పక్షులను తెచ్చుకొని పంజరంలో బంధించి వాటిని అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా పక్షులను ఇంట్లో బంధించి పెంచడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పక్షులను ఇంట్లో బంధించడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు సైతం మనశ్శాంతిని కోల్పోయి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఎంతో స్వేచ్ఛగా విహరించే పక్షులను బంధించడం ఎంతో పాపం.ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పక్షులను బంధించడం వల్ల పక్షులు ఎప్పుడూ కూడా ఇంటికి ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తుంటాయి. ఇలా ప్రతికూల పరిస్థితులను ఆకర్షించడం వల్ల ఇంట్లో అన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.

ఎప్పుడైతే మన ఇంటిపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందో ఆ సమయంలో మనం అనుకున్న పనులు సక్రమంగా జరగవు. అదే విధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి.అందుకే పక్షులను ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా వదిలేయాలి కానీ ఇంట్లో బంధించకూడదు ఒకవేళ ఇంటికి తెచ్చుకున్న వాటిని అపురూపంగా చూసుకోవడం వల్ల అవి మన ప్రేమకు లొంగిపోయి ఎక్కడికి వెళ్లినా తిరిగి మన ఇంటికి వస్తాయి. ఒకవేళ పంజరం పెట్టిన కూడా పంజరపు తలుపులు మూయకుండా వాటిని చూసుకోవడం మంచిది కానీ వాటిని ఎట్టి పరిస్థితులలో బంధించకూడదని పండితులు చెబుతున్నారు.