సాధారణంగా ప్రతి ఇంట్లో లవంగాలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న ఈ లవంగాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ లవంగాలతో ఆరోగ్య సమస్యలను దూరం చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న అనేక సమస్యలను కూడా దూరం చేయవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ లవంగాలను ఉపయోగించి ఇంట్లో ఉన్న అనేక సమస్యలను తొలగించవచ్చు. సాధారణంగా ప్రతి ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యలను తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లభించకపోవడంతో నిరాశ చెందుతూ ఉంటారు.
అటువంటి సమయాలలో.. కొంచం కర్పూరం తీసుకోని అందులో కొన్ని లవంగాలు వేసి వెలిగించాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మనం విలువైన వస్తువులు డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాము. వాటిని తిరిగి పొందటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లభించకపోతే ఎరుపు రంగు గులాబీలలో కర్పూరం కొన్ని లవంగాలు వేసి ఆ పువ్వులను దుర్గామాతకు సమర్పించి ఆరాధించాలి. ఇలా చేయటం వల్ల మనం పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందవచ్చు.
ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో కర్పూరం యాలకులు లవంగాలు ఒక గిన్నెలో వేసి పొగ పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మనం చేసే పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఒక ఇత్తడి పాత్రలోకి కర్పూరాన్ని వేసి అందులో కొంచెం నెయ్యి వేసి పొగ పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఉన్న పెదకూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పటిస్తూ కర్పూరం లవంగాలు కలిపి వెలిగించి ఆ విభూదిని ధరించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోతాయి.