శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వేదంలోని ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలగా వర్ణిస్తున్నాయి.
ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. అశ్వవాహనాన్ని అధిరోహించి కల్కి అవతారంలో తనరూపాన్ని స్వామి భక్తులకు అనుగ్రహించారు.
స్వామి అశ్వవాహన సేవను చూసినవారికి కలిదోషాలు పోతాయని, ఇంద్రియ నిగ్రహం వస్తుందని కొంతమంది భక్తుల విశ్వాసం