తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరోరోజు సెప్టెంబర్ 24న ఉదయం, సాయంత్రం విశేష పూజలు నిర్వహించి ఆయా వాహనాలలో స్వామిని ఆరాధించారు. ఆ వివరాలు…
2020 th year 6 th day highlights of vehicle services in tirumala brahmotsavalu
హనుమంత వాహనం:
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై స్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు.
ఇక అదేవిధంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించాల్సి ఉండగా ఈసారి సర్వభూపాల వాహనంలో సేవలు చేశారు.
2020 th year 6 th day highlights of vehicle services in tirumala brahmotsavalu
రాత్రి గజవాహనంలో
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం వేంకటపతిని హృదయంలో ఉంచి శరణాగతి చెందాలని ఈ వాహనసేవలోని ఆంతర్యం.