నాల్గోరోజు వాహన సేవలు ఇవే !

2020 th year 4 th day vehicle service for sri venkateswara swamy in tirumala brahmotsavalu

తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారికి వాహనసేవ జరిగింది. ఆ వివరాలు…
నాలుగోరోజు ఉదయం, స్వామివారు కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ, ఇతిహాసాలలో ఓ విశిష్ఠ స్థానం ఉంది.

2020 th year 4 th day vehicle service for sri venkateswara swamy in tirumala brahmotsavalu
2020 th year 4 th day vehicle service for sri venkateswara swamy in tirumala brahmotsavalu

ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారమన్నది వేరుగా చెప్పేదేముంది. కోరిన వరాలిచ్చే దేవతా వృక్షం కల్పవృక్షం.. శ్రీవారిని హృదయంలో ప్రతిష్టించుకున్నట్టే.. ప్రతి మనిషీ.. తన హృదయాన్ని కల్పవృక్షంగా మార్చుకోవాలన్నది కల్పవృక్ష వాహనసందేశం..

2020 th year 4 th day vehicle service for sri venkateswara swamy in tirumala brahmotsavalu
2020 th year 4 th day vehicle service for sri venkateswara swamy in tirumala brahmotsavalu

కల్ప వృక్ష వాహన సేవ అనంతరం రాత్రి అంటే సెప్టెంబర్ 22న స్వామివారు సర్వభూపాలవాహనంపై విహరించారు.. లోకంలో భూపాలకులందరికీ అధిపతి ఆ శ్రీమన్నారయణుడేననడాన్ని ఈ వాహనం సేవ తెలియజేస్తుంది. పశుపక్ష్యాదులను తన వాహనాలుగా మలచుకుని తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామివారు భూపాలురపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సర్వభూపాల వాహన సేవలో ఉభయ నాంచారులతో ఊరేగారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం సిద్దిస్తుందని నానుడి.