సింహాచల క్షేతం వైజాగ్‌లో వైభవంగా వరాహ నర్సింహ క్షేత్రంగా వైభవం పొందుతోంది. అసలు వరాహ నారసింహ క్షేత్రమేమిటి ..ఈ సింహాచలంలో ఈ క్షేత్రం ఎప్పుడు ఆవిర్భవించింది. ఎంత కాలమైంది. వరాహ నారసింహం అష్టావతారాలో, దశావతారాల్లో ఎక్కడా కనిపించటం లేదే. వరాహ అవతారం, నారసింహ అవతారం ఉంది కానీ వరాహ నారసింహం ఎక్కడి నుంచి వచ్చింది అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ వరాహలక్ష్మీ నారసింహం అనేటటువంటిది. ఏ విధంగా ఆవిర్భవించిందంటే… దీనిని అందరూ ద్వయావతారంగా చెబుతారు. కానీ నిజానికి ఇది త్రయావతారం. త్రయావతారమైన మూర్తి నారసింహం. ద్వయావతారం అంటే రెండు నరసింహావతారం, వరాహ అవతారం కలిసినది ద్వయావతారం. మూర్తి, త్రిమూర్తి ఆత్మకలిగినటువంటిది. నరుడు సింహం రెండూ కలిగినటువంటిది. దానికి తోడు వరాహం కూడా తోడయినది. అందుకే వరాహ నార సింహము అన్న పేరు వచ్చింది.
ఈ మూడు రూపాలు కలిగినటువంటి వైభవ క్షేత్రం ఏ విధంగా ఇక్కడ ఆవిర్భవించింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం… నారసింహావతారం అనేది ప్రహ్లాద ప్రార్ధనతో హిరణ్య కసిసుడిని సంహరించి అనంతరం స్వామి అంగలి వేసుకుంటూ వచ్చేస్తున్నాడంట. ఆ రౌద్రాన్ని వీడకుండానే వెళ్ళటం చూసిన అక్కడి వారంతా ఈయన ఎక్కడికి వెళుతున్నాడా రౌద్రంగా అని ఎవరికి వారే ఆశ్చర్యపోతారు. అలా అడుగులు వేసుకుంటూ వచ్చే స్వామిని మధ్య మార్గంలో చూసినటువంటి సర్వజీవులు సర్వ జనానీకము ఎవరికి వారే వారు పాపం చేశారేమో అని భావిస్తూ ఉన్నారు. ఆయన దుష్ట శిక్షణ కోసమే వచ్చారని భావిస్తున్నారు. ధర్మ పరిరక్షణ కోసం వచ్చారు. ఈయన రాకతో ఎవరికి వారే సమాలోచనలో పడ్డారు. దాంతో అందరూ ప్రార్ధనలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ స్వామి వారు నాయనా నేను మిమ్మల్ని ఉద్ధరించడానికే వచ్చాను కానీ వేరే విధంకాదు దుష్టశిక్షణ, ధర్మపరిరక్షణకోసం నేను అడుగులు వేస్తున్నాకానీ మీకోసం కాదునాయనా అంటూ వారికి అభయాన్నిచ్చి వెళ్ఙపోయాడు.
అలా ఎక్కడైతే దుష్టశిక్షణ ఉంటుందో అక్కడ మొత్తం ఆ పని చేసుకుంటూ అడుగులు ముందుకు వేయడంతో ఆ ప్రదేశాలు మొత్తం 32 నారసింహాలుగా మనకు వెలశాయని చెబుతున్నాయి. 32 క్షేత్రాలలో కూడా నరసింహుడు ఎక్కడా వేదాన్ని అదిదేవతగా కొలిచిన రుషులు ఆ నారసింహుడు కనిపించగానే స్తోత్రము చేయడంతో వేదాద్రి నారసింహుడుగా అక్కడి వారికి సాక్షాత్కరించారు. ఇక యోగులు పూజించిన చోట యోగనారసింహుడుగా వెలిశాడు. ఇలా రక రకాల ప్రదేశాలలో రకరకాల రూపాల్లో వెలిశాడు. వేదాన్ని ఆదిదేవతగా కొలిచిన దగ్గర వేదనారసింహుడుగా, జ్వాలని అది దేవతగా కొలిచినప్పుడు జ్వాలా నరసింహుడుగా వెలశాడు. ఇలా ఇత్యాది క్షేత్రాలలో మంగళగిరికి వచ్చేటప్పటికి మహాజగన్మాత లక్ష్మీవల్ల దేవతలందరూ లక్ష్మీదేవిని ప్రార్ధించటంతో ఆమె చంచెలక్ష్మీగా అవతరించింది.