త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తుల కంటే ముందున్న కారణంగా త్రిపుర సుందరి అని పేరు. ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి’గా ఉన్న ఈమె ఆ తర్వాత పరమ శాంత రూపిణిగా మారింది. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. నవరాత్రి 5వ రోజున పూజలందుకొని లలితాత్రిపుర సుందరి సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది.
ఈ తల్లిని ఆరాధిస్తే దారిద్య్ర దుఃఖాలు తొలగి సకల అభీష్టాలు నెరవేరుతాయి. అమ్మకు కుంకుమార్చన చేసే మహిళలు మాంగల్య సౌభాగ్యాన్ని జీవితాంతం పొందుతారు. ఈ రోజున లలితా అష్టోత్తరం, ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని సార్లు జపించాలి. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున సరస్వతీ దేవి, ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది.
లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. నైవేద్యం అప్పాలు, పులిహోర, పెసరబూరెలు.