తిరుమ‌ల‌లో మాన‌వుల‌కు సాధ్యంకాని ప‌ని ఆవు చేసిందా?

మ‌నం ఎక్క‌డ‌కి వెళ్ళాల‌న్నా.. ఏం చేయాల‌న్నా… ఆ దేవుడి అనుగ్ర‌హం కావాలంటారు పెద్ద‌లు. ఆఖ‌రికి దేవుని గుడికి వెళ్ళాల‌న్నా కూడా ఆయ‌న ద‌య లేనిదే వెళ్ళ‌లేము. మ‌నం వెళ్ళాల‌ని నిర్ణ‌యించుకున్నా ఒక్కోసారి అన్నీకుదిరినా ఏదో ఒక ఆటంకం ఎదుర‌వుద్ది. పుణ్య‌క్షేత్రాల్లో అతి పెద్ద పుణ్య‌క్షేతం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిత్తూరు జిల్లాలో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు.

తిరుమల 15 వందల ఏళ్ల నుండి తిరుమల, పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది.ప్రపంచవ్యాప్తంగా భక్తులు కలియుగ దైవం నెలకొన్న పవిత్రపుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి లీల ఆయన లీలలు, అన్ని ఇన్ని కావు. తాజాగా శ్రీవారి లీల మరొకటి వెలుగులోనికి వచ్చింది. సాధారంగా తిరుమలకు కాలినడకన వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. శ్రీవారి లీల కాళ్ళ నొప్పులనేవి సహజంగా వస్తూవుంటాయి.మానవులకే ఇన్ని ఇబ్బందులంటే ఇక జంతువుల విషయం వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

ఇటీవ‌లె 2300 మెట్లు ఎక్కి ఒక గోవు కాలినడకన తిరుమలకు చేరుకుంది. వివరాలలోకి వెళితే… తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్ల మార్గం నుంచి ఒక గోవు 2300 మెట్లను సునాయాసంగా ఎక్కి తిరుమలకు చేరుకుంది. గోవును చూసిన భక్తులు కాలినడకన మార్గంలోనే భక్తులతో కలిసి గోవు ఎక్కింది. గోవును చూసిన భక్తులు ఆశ్చర్యపోయి ఆ గోవుకు కుంకుమబొట్లు పెట్టారు. శ్రీవారి లీలగా కొంతమంది గోమాతకు నమస్కరించారు. కొంతమంది అరటి పండ్లు, కొన్ని పండ్లను ప్రసాదంగా ఇచ్చారు. గోవు మెట్లు ఎక్కి తిరుమలకు వెళ్ళటం ఏమిటో ఇప్పటికి ఎవరికీ అంతుపట్టటంలేదు శ్రీవారి లీల తిరుమలకు వెళ్ళిన గోవును టిటిడి అధికారులు గుర్తించి గోవును తిరుమలలోని గోశాలకు తరలించారు.