భారత దేశంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దీపావళి పండుగను దేశ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున ప్రజలందరూ ఆనందంగా దీపాలు వెలిగించిన రోజులు దీపావళి పండుగగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున సంపదకు అధిపతి అయిన లక్ష్మి దేవిని ఈ విధంగా పూజించటం వల్ల ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు.
దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ విధానం:
• దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడానికి ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుభ్రతను ఇష్టపడే లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే నివసిస్తుందని నమ్మకం.
• అలాగే దీపావళి పండుగ రోజున ఈశాన్య దిశలో లక్ష్మీదేవిని పూజించాలి. అందుకోసం పూజ గదిలో ఈశాన్య దిశని గంగాజలంతో శుభ్రం చేసి శుద్ధి చేయాలి.
• దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి గణపతిని పూజించటానికి ముందుగా ఈశాన్య దిశలో బియ్యం పిండితో ముగ్గు వేసి అక్కడ ఒక పీఠాన్ని ఉంచి దానిపై వస్త్రాన్ని పరిచి నవగ్రహాలను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత పసుపుతో తయారుచేసిన లక్ష్మీ గణపతిని స్థాపించి నియమ నిష్టలతో పూజ చేయాలి. పూజ చేయాలి.
• ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంచాలి.
• దీపావళి పండుగ రోజు సాయంత్రం లక్ష్మీ గణేష్ తో పాటు విష్ణువును కూడా పూజించాలి. ఎందుకంటే మహావిష్ణువు పూజింపబడిన చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
• దీపావళి పండుగ రోజు రాత్రి శ్రీ యంత్రాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరిసంపదలతో వర్ధిల్లుతారు.
• దీపావళి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించే సమయంలో ఆ దేవికి ఇష్టమైన ఆవుపాలు గోమతి చక్రం, కొబ్బరికాయ, నాగకేసర తామర పువ్వు ఉంచి పూజించాలి. ఇలా లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆమె అనుగ్రహం కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది.