వీడియోకు వ్యూస్ రాలేదని ఆత్మహత్య.. పిచ్చి ముదిరిపోయిందంటూ ట్రోల్స్!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల దానివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లో వాడకం పెరగటం వల్ల చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుండి ఫోన్ తోనే సమయం గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కాలం యువత ఆన్లైన్ గేమ్స్, డాన్స్ వీడియోస్ అంటూ చదువు పక్కన పెట్టి తిండీ, నిద్ర మానేసి మరి అర్థ రాత్రి వరకూ ఫోన్ తో గడుపుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ వీడియోస్ అంటూ వ్యూస్ కోసం పాకులాడుతున్నారు. అయితే ఇలా చేస్తున్న కొంతమంది మాత్రమే సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు వ్యూస్ కోసం దారుణాలకు కూడా పాల్పడుతున్నారు.

తాజాగా ఒక యువకుడు యూట్యూబ్లో తన వీడియోస్ కి వ్యూస్ రావటం లేదని మనస్థాపనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన సైదాబాద్‌ క్రాంతినగర్‌లో ఇటీవల చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. సైదాబాద్‌ క్రాంతినగర్‌లో నివాసం ఉంటున్న డీనా అనే యువకుడు ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అందరి యువకుల లాగే డీనా కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో selflo గేమ్‌ ఛానెల్‌ను అతను నిర్వహిస్తున్నాడు. అయితే యూట్యూబ్ లో తనకి ఎక్కువ వ్యూస్ రాయలేదని మన స్థాపకు చెందిన డీనా గేమ్‌ ఆడుతూ తన బాధను నెటిజన్స్ తో పంచుకున్నాడు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన డీనా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జీవితంలో ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించిన డీనా మాత్రం తొందర పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు 8 గంటల ముందే సూసైడ్ లెటర్‌ను డీనా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక డీనా ఆత్మహత్య చేసుకోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. డీనా తండ్రి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయగా అతని తల్లి డిఆర్ డిఓలో పని చేస్తుంది. డీనా ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.