డేరాబాబా కంటే దారుణంగా యాదాద్రిలో.. ఐదేళ్ల పిల్లలకు సెక్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారో తెలుసా?

యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల గురించి విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యాదగిరిగుట్టలో కొన్ని దశాబ్దాలుగా వ్యభిచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు బయటపడిన విషయాలు మాత్రం అమానవీయంగా ఉన్నాయి. పసిపిల్లలను కిడ్నాప్ చేయడం లేదా పిల్లలు లేరని మాయమాటలు చెప్పి పేదవారినుండి పిల్లల్ని కొనుక్కుని అక్కడి వ్యభిచార కూపాలకు అమ్మేస్తున్నారు కొంతమంది ముఠా. అభం శుభం తెలియని ఆ పసి పిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి శరీరంలో అసహజ మార్పులు తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. ఒప్పుకోకపోతే అత్యంత దారుణంగా ఇనుప చువ్వలతో వాతలు పెట్టడం, అన్నం నీళ్లు ఇవ్వకుండా మాడ్చటం, విపరీతంగా కొడుతూ వారిని హింసిస్తున్నారు.

ఐదు సంవత్సరాల వయసు నుండే బాలికలకు శృంగారంలో శిక్షణ ఇస్తున్నారు వ్యభిచార నిర్వాహకులు. పగలంతా ఇంటి పని నేర్పించి రాత్రి కాగానే వారికి శృంగారానికి సంబంధిన వీడియోలు చూపిస్తారు. ఒకవేళ పొరపాటున నిద్రపోతే ఆరోజు వారికి చిత్రహింసలతో నరకాన్ని చూపిస్తారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే..ఒక జంట శృంగారం చేస్తున్నపుడు ఈ పిల్లలు చూడాలి. ఇలా చేయటం ద్వారా వారికి వ్యభిచారం తప్పు అనే భావన కలగదని నిర్వాహకుల అభిప్రాయమట.

ఏడేళ్ల వయసున్న బాలిక స్త్రీ, శిశు సంక్షేమ అధికారులకు చెప్పిన విషయం వింటే గుండె తరుక్కుపోతుంది. ఒకరోజు అలసిపోయి అవి చూడకుండా నిద్రపోయినందుకు వాతలు పెట్టి హింసించారట. ఇక ఆ మరుసటి రోజు కళ్ళెదురుగా జరుగుతున్న శృంగారాన్ని చూస్తూ ఉండిపోయింది నిద్రపోకుండా. బాలికలకు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వటానికి ఏకంగా ఒక హాస్పిటల్ నిర్వహిస్తున్నారంటే ఆ ముఠా ఎంత పెద్దదో అని, దీనివెనుక ప్రముఖల హస్తాలు కూడా ఉండొచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనురాధ హాస్పిటల్ లో 40 హార్మోన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆసుపత్రిని సీజ్ చేసి, డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు.

డేరా ఆశ్రమంలో ఆడవారిని దాచటానికి, బాబా శృంగారం కోసం గుహలు ఏర్పాటు చేసుకున్నట్టే ఇక్కడ కూడా మంచాల కింద బంకర్లు ఏర్పాటు చేశారు వ్యభిచార నిర్వాహకులు. పోలీసులు తనిఖీలకు వస్తే వాటిలో దాచేస్తున్నారు ఆ బాలికలను. ఒక్క యాదగిరిగుట్టలోని కాదు ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.