జుట్టుకు రంగు వేసుకునేవాళ్లకు షాకింగ్ న్యూస్.. కలర్ వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలా?

మనలో చాలామంది అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు నల్లగా కనిపించడం కోసం కొంతమంది హెయిర్ డైలపై ఆధారపడతారు. అయితే హెయిర్ డైలను వాడటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. జుట్టుకు పదేపదే రంగు వేయడం వల్ల ఆ ప్రభావం జుట్టు ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యంపై కూడా పడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతోంది.

హెయిర్ డైల తయారీ కోసం ఒక్కో కంపెనీ ఒక్కో తరహా కెమికల్స్ ను వినియోగిస్తాయి. కొన్ని కెమికల్స్ శరీరానికి సూట్ అయ్యే విధంగా ఉంటే మరికొన్ని కెమికల్స్ శరీరానికి సూట్ కాని విధంగా ఉంటాయి. జుట్టుకు డై వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కంటికి సంబంధించిన వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. హెయిర్ డైను చెవి వెనుక రాసి ఎలాంటి అలర్జీ లేకపోతే మాత్రమే వినియోగించాలి.

హెయిర్ డైలో కొన్ని కంపెనీలు కోల్ తార్, పీపీడీ అనే కెమికల్స్ ను వినియోగిస్తున్నాయి. ఈ కెమికల్స్ వల్ల వేర్వేరు క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. గ్లౌజులు ధరించి చర్మానికి తగలకుండా హెయిర్ డై వేసుకుంటే మంచిది. గర్భిణీ స్త్రీలు హెయిర్ డైలకు దూరంగా ఉంటే మంచిది. హెయిర్ డైలలో ఉపయోగించే రంగుల వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

హెయిర్ డైల వల్ల జుట్టు చిట్లిపోయి బలహీనపడే అవకాశాలు కూడా ఉంటాయి. జుట్టుకు హెయిర్ డైలకు బదులుగా మెహిందీ లేదా హెన్నా పెడితే మంచిది. రసాయనాలు లేని హెయిర్ కలర్స్ ను ఎంచుకుంటే అనుకూల ఫలితాలు ఉంటాయి. సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సార్ల కంటే ఎక్కువసార్లు జుట్టుకు రంగు వేయడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.