కోరిక తీర్చమన్న బ్యాంక్ మేనేజర్ కు చెప్పు దెబ్బలు (వీడియో)

ఆయన ఒక బ్యాంకులో మేనేజర్. బ్యాంకుకు లోన్ కోసం వచ్చిన ఒక మహిళపై కన్నేశాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. లోన్ కావాలంటే కండిషన్ పెట్టాడు. తన కోరిక తీరిస్తే లోన్ మంజూరైతదన్నడు. దీంతో ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. బ్యాంకు మనేజర్ ను బజారులోకి గుంజుకొచ్చింది. పొర్క తీసుకుని పొల్లు పొల్లు కొట్టింది. పూర్తి వివరాలు ఇవి.

కర్ణాటకలోని దేవనాగరిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. దేవనాగరికి చెందిన ఒక మహిళ లోన్ కోసం స్థానిక బ్యాంకు కు వచ్చింది. అయితే లోన్ కావాలంటే తన కోరిక తీరచాలని డిమాండ్ చేశాడు బ్యాంకు మనేజర్. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ బ్యాంకు మేనేజర్ ను బ్యాంకుల నుంచి బజారుకు ఈడ్చుకొచ్చింది.

లోన్ ఇవ్వాలంటే పడుకోవాల్నారా అంటూ కుమ్మి పడేసింది. ఆమె బ్యాంకు మేనేజర్ ను పొర్కతోటి కొడుతుంటే స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీ వైరల్ చేసింది. ఆ వీడియో కింద ఉంది చూడండి.