హైదరాబాద్ కొత్తపేటలోని మెట్రో రైల్వే స్టేషన్ మీది నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎల్ బి నగర్ లోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన స్వప్న, రాఘవేంద్ర భార్య భర్తలు వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రాఘవేంద్ర సాప్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
రాఘవేంద్ర తండ్రి మంగళవారం రాఘవేంద్ర ఇంటికి వచ్చాడు. మనవడిని తీసుకెళ్లి మళ్లీ సాయంత్రం వరకు తీసుకొస్తానన్నాడు. ఇది ఇష్టం లేని స్వప్ప తన భర్త డ్యూటికి పోగానే మంగళవారం రాత్రి 9 గంటలకు కొత్త పేట మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చింది. ప్రయాణికురాలిలా నటించి ఉన్నట్టుండి పై నుంచి కిందకు దూకింది. అదృష్టవశాత్తు స్వప్ప గాయాలతో బయటపడింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు స్వప్నను ఆస్పత్రికి తరలించారు. స్వప్న ఆత్మహత్యకు యత్నించిన వీడియో కింద ఉంది చూడండి.
స్వప్నకు కుడి చేయి విరగడంతో పాటు నడుముకు గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే స్వప్ప ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్టు తెలుస్తోంది.
మెట్రోె స్టేషన్ మీది నుంచి మహిళ దూకడంతో మెట్రో అధికారలు ఉలిక్కి పడ్డారు. 240 మీటర్లకు పైగా పొడవు ఉండే మెట్రో స్టేషన్లలో ప్రహరీలు భద్రత కల్పించలేనివిగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. పిల్లలు వెళ్లినా వారి ఎత్తు కంటే తక్కువగానే ప్రహారీలు ఉన్నాయన్నారు. రెండు అంతస్తుల్లో ఉండే మెట్రో స్టేషన్లలో కోర్ లెవల్ లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నా ఫ్లాట్ ఫాం లెవల్ లో మాత్రం తక్కువ మంది సిబ్బంది ఉంటున్నారు.
మెట్రో ఏర్పాటు తర్వాత తొలిసారి సంఘటన జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు చర్యలు చేపడుతామన్నారు. భద్రతాపరంగా సిబ్బందిని పెంచడంతో పాటు ప్రహరిలు ఎత్తును పెంచుతామన్నారు.