పోలీసుల తీరుపై కలత చెంది నిప్పంటించుకున్న మహిళ (వీడియోలు)

సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. అవమాన భారంతో ఓ మహిళ గ్యాస్ నూనె పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. సికింద్రాబాద్ అన్నానగర్ నివాసి సబిత బాత్రూంలో స్నానం చేస్తుండగా దొంగ చాటుగా వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీశాడని బాధితురాలు బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సబిత మనస్థాపానికి గురైంది.  ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలని దీనికి కూడా కేసు నమోదు చేస్తామా అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మహిళ గ్యాస్ నూనె పోసుకొని నిప్పంటించుకున్న వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

దీంతో సబిత బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. అందరూ చూస్తుండగానే కిరోసిన్ పోసుకొని ముట్టించుకుంది. వెంటనే తేరుకున్న పోలీసులు సబిత మంటను ఆర్పి హూటాహూటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధతురాలి పరిస్థితి విషమంగా ఉంది. అయితే నిందితునిపై కేసు నమోదు చేయకుండా కుటుంబ కలహాలే కారణమని కేసును తప్పు దారి పట్టించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. బాధితునిపై అలాగే సబిత ఆత్మహత్యాయత్నానికి కారణమైన పోలీసులపై  చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నంతో కేసు తీవ్రత పెరిగింది. ఈ కేసులో పోలీసులపై కూడా వేటు తప్పదేమోనని న్యాయ నిపుణులు అంటున్నారు. బాధితురాలు ఫిర్యాదుకు వచ్చినప్పుడు ఇరు వర్గాలు  ఒప్పుకొని కాంప్రమైజ్ అయితే అది ఓకే కానీ బాధితురాలు ఖచ్చితంగా కేసు పెట్టాలని డిమాండ్ చేసినా కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. సీపీ పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.