హీరోయిన్ గజాలా ఆత్మహత్యాయత్నం చేయడం వెనుక అసలు కారణం తెలుసా?

తక్కువ సినిమాల్లోనే నటించినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నటీమణుల్లో హీరోయిన్ గజాలా ఒకరనే సంగతి తెలిసిందే. నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా నటిగా గజాలా కెరీర్ మొదలైంది. జగపతిబాబు ఈ సినిమాలో హీరో కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. గజాలా తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాలలో కూడా నటించారు.

గజాలా మస్కట్ లో జన్మించగా ఆమె తండ్రి ప్రముఖ బిజినెస్ మేన్ కావడం గమనార్హం. స్టూడెంట్ నంబర్1, అల్లరి రాముడు, మల్లీశ్వరి, కలుసుకోవాలని, జానకి వెడ్స్ శ్రీరామ్ మరికొన్ని సినిమాలు ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే కెరీర్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో గజాలా ఆత్మహత్యాయత్నం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. 2002 సంవత్సరం జులై నెలలో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు.

ప్రశాంత్ కుటీర్ అనే గెస్ట్ హౌస్ లో నిద్రమాత్రలు మింగడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు. భరతసింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గజాలా అసిస్టెంట్ సుల్తానా, హీరో అర్జున్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి ఆమెను కాపాడారు. ఒంటరిగా ఫీల్ కావడం వల్లే గజాలా ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం జరగగా బాయ్ ఫ్రెండ్ తో గొడవల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని మరి కొందరు ప్రచారం చేశారు.

ఈ సంఘటన తర్వాత గజాలాకు సినిమా ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం పలు వ్యాపారాలతో గజాలా బిజీగా ఉన్నారు. 2016 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గజాలా వివాహం జరిగింది. ఫైజల్ రజా ఖాన్ అనే నటుడిని గజాలా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం గజాలా భర్తతో కలిసి అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. గజాలా తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాకు కూడా గజాలా దూరంగా ఉంటున్నారు.