ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రేమ పేరుతో మోసపోయిన ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ చిన్న వయసులోనే ఆకర్షణకులోనే దానిని ప్రేమ అని భావించి ప్రేమ కోసం ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తున్నారు. వారి ప్రేమకు తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో కొందరు ఇంటి నుండి పారిపోయి వివాహాలు చేసుకుంటుంటే మరికొందరు మాత్రం తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తన ప్రేమను నిరాకరించాడన్న కారణంతో ఒక కూతురు తన తండ్రి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఐదేళ్లు శిక్ష పడేలా చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…మహారాష్ట్రలోని అంధేరీకి చెందిన బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి ఇలాంటి పనులు చేయవద్దని ఆమెను హెచ్చరించాడు. అయినా బాలిక తండ్రీ మాటను లెక్కచేయకుండా ప్రియుడిని కలవటానికి వెళ్ళేది. దీంతో బాలిక తండ్రి కూతురిపై చేయి చేసుకున్నాడు. ఇలా తన తండ్రి కొట్టడంతో ఆగ్రహానికి ఎవరైనా బాలిక తన తండ్రి మీద లైంగిక ఆరోపణలు చేసింది. తన తండ్రి తనపై లైంగిక దాడి చేశాడని 2017లో స్కూల్ టీచర్ కి బాలిక చెప్పింది. అయితే సదరు స్కూల్ టీచర్ ఓ ఎన్జీవో సంస్థతో కలిసి డీఎన్ నగర్ పోలీసులకు బాలిక తండ్రిపై ఫిర్యాదు చేసింది. .
స్కూల్ టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక తండ్రిని 2017లో అరెస్టు చేశారు. ఆ తర్వాత బాలికకు వైద్య పరీక్షలు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. అయితే ఈ వైద్య పరీక్షలలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాలిక మీద ఎటువంటి హత్యాచారం జరగలేదని మెడికల్ టెస్టుల్లో బయటపడింది. దీంతో పోలిసులు బాలికను విచారించగా అసలు విషయం బయటపెట్టింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని తండ్రీ పై తప్పుడు ఆరోపణలు చేసినట్టు అంగీకరించింది. అయితే బాలిక మానసిక పరిస్థితి బాగోలేక తన తండ్రీ పై అలా తప్పుడు ఆరోపణలు చేసిందని పోలీసుల విచారణలో తేలడంతో ఇటీవల బాలిక తండ్రిని కోర్టు నిర్దోషిగా గుర్తించి విడుదల చేసింది.