భార్యను దోస్తుల దగ్గర పడుకోమన్న భర్త

మంచి అమెరికా సంబంధం.. అమెరికాల పిల్లగానిది సాఫ్ట్ వేర్ జాబ్. బిడ్డను ఇస్తే హాయిగా బతుకుతదని ఆ తల్లిదండ్రులు ఆశించి ఉన్నంతల బిడ్డ పెళ్లి చేశారు. కొత్త జీవితంలోకి ఎంటరైన  ఆ పెళ్లి కూతురు ఎన్నోఆశలతో అమెరికాకు చేరింది. అంతలోనే ఆమె ఆశలు ఆవిరయ్యాయి. చివరికి తన పోరాటంలో ఓడి తనువు చాలించింది.  ఈ సంఘటనకు సంబంధించి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం…

ప్రకాశం జిల్లా కందుకూరు కి చెందిన గంగాధరి, మాల్యాద్రి దంపతులు  వలస వచ్చి సికింద్రాబాద్ లో 20 ఏళ్ల నుంచి నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. చిన్న కూతురు మాధవిని బిటెక్ వరకు చదివించారు.

ఒంగోలుకు చెందిన సుబ్బులు, వెంకటేశ్వర్లు దంపతులు జీడిమెట్లలో ఉండేవారు. వీరి కొడుకు కోటేశ్వరరావు అమెరికాలో జాబ్ చేసేవాడు. వీరికి మధ్యవర్తుల ద్వారా సంబంధం కుదరడంతో మాధవికి కోటేశ్వరరావుకు 2016 నవంబర్ 9 న వివాహం జరిపించారు.

మాధవి, కోటేశ్వరరావు దంపతులు

అమెరికాకు వెళ్లిన తర్వాత కోటేశ్వరరావు అసలు స్వరూపం మాధవికి తెలిసి ఇండియాకు వచ్చింది. పెద్దలు సర్దిచెప్పి పంపించారు. అయినా కూడా కోటేశ్వరరావు ప్రవర్తనలో మార్పు రాలేదు. నిత్యం తాగుతూ జులాయిగా తిరిగేవాడు. తనతో కలిసి మాధవిని తాగమని, పేకాట ఆడమని వేధించేవాడు. లోదుస్తులు ధరించి పేకాట ఆడమని వేధించేవాడని మాధవి పలుసార్లు తల్లిదండ్రుల వద్ద వాపోయిందని బంధువులు తెలిపారు.

మాధవిని ఎప్పుడూ కొట్టేవాడని  ఆ బాధ భరించలేక ఈనెల 11న అమెరికా నుంచి ఇండియా చేరుకున్న మాధురి శనివారం ఆత్మహత్య చేసుకుంది. మాధవి ఆత్మహత్య పై ఆమె తల్లి స్పందించింది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, బిడ్డ సుఖపడుతుందని పెళ్లి చేశామంది. నిత్యం వేధించి తన బిడ్డను  పొట్టన పెట్టుకున్నాడని ఆమె విలపించింది.  

మందు కొట్టి, మత్తుమందులు వేసుకుని, తన స్నేహితుల పక్కన పడుకోవాలని మాధవి భర్త కోటేశ్వరరావు వేధించే వాడని తెలిపింది. ఈ విషయం తనకు ఫోన్ లో చెప్పిన మాధురి బోరున విలపించిందని అన్నారు. ఇదే విషయాన్ని కోటేశ్వరరావు తనతోనే ధైర్యంగా ఫోన్ లో చెప్పాడని, అప్పుడే తన బిడ్డను తమ వద్దకు పంపించాలని వేడుకున్నానని ఆమె వాపోయింది.

“నీ కూతురు నాకు వద్దు… నా ఫ్రెండ్స్ కాడికి రానంటోంది. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నీ కూతురు నాకు వద్దు. మందు తాగేదానికి ఒప్పుకుంటేనే నీ కూతురు నాకాడ ఉంటది అన్నాడు. ఇద్దరూ కలసి రమ్మని చెప్పాను. వాడు రానన్నాడు. కనీసం అమ్మాయిని పంపించమని అడిగితే, టికెట్ కు డబ్బులెవడిస్తాడని అడిగాడు.

నా బిడ్డకు టికెట్ బుక్ చేసుకోవడం చేతకాదని చెప్పింది. దణ్ణం పెట్టి అడిగాను. డబ్బులు నేను మీ అమ్మానాన్నలకు ఇస్తానని చెప్పాను” అని బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, అమెరికాలో ఉన్న కోటేశ్వరరావును ఎలాగైనా ఇండియాకు రప్పించి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.