ఆయన ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. 2007 లో పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్నాడు. వారికి 8 సంవత్సారాల వయసుగల అమ్మాయి ఉంది. ప్రమోషన్ తో ఆయన టిం లీడర్ అయ్యాడు. ఆయన ప్రాజెక్టు చేస్తున్నప్పుడే సహచర ఉద్యోగినితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏకంగా భార్యా పిల్లలను విడిచి పెట్టి ఆమె తో కలిసి ఆ సాఫ్ట్ వేర్ భర్త వేరు కాపురం పెట్టాడు.దీంతో అసలు విషయం తెలుసుకున్న టెకీ భార్య వారిద్దరు కలిసున్నప్పుడు రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చెందిన నాగరాజు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. 2007 లో అమూల్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి 8 సంవత్సరాల అమ్మాయి అన్విక ఉంది. వివిధ కంపెనీలలో పని చేసిన నాగరాజు ప్రస్తుతం టిసిఎస్ కంపెనీలో టిం లీడర్ గా పని చేస్తున్నాడు. టిం లీడర్ గా పని చేస్తున్న నాగరాజుకు అదే కంపెనీలో పని చేస్తున్న రాధారాణి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త వీరిద్దరి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
నాగరాజు రాధారాణితో కలిసి హస్తినపురం ద్వారకా నగర్ లో కాపురం పెట్టాడు. భార్యపిల్లలను పట్టించుకోకుండా అక్కడికే వెళుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఇంటికి రాకుండా భర్త ఎక్కడికి పోతున్నాడని అమూల్య ఆరా తీసినా తనకు సమాచారం తెలియలేదు. ఫోన్ చేస్తే కంపెనీ పని మీద బయటికి వెళ్లానని చెప్పాడట. ఆయన మాటలపై నమ్మకం లేని అమూల్య కంపెనీ దగ్గరికి వెళ్లింది. నాగరాజు పని ముగించుకొని కంపెనీ నుంచి వచ్చిన తర్వాత నాగరాజు వాహనాన్ని అమూల్య మరో వాహనంలో ఫాలో అయ్యింది. ఆయన ద్వారకాపురి కాలనీలోని ఇంట్లోకి వెళ్లాడు. రెండు రోజుల పాటు పూర్తిగా గమనించిన అమూల్యకు అసలు విషయం తెలిసింది. దీంతో తన బంధువులకు సమాచారం ఇచ్చి వారిద్దరు ఇంట్లో ఉండగా వెళ్లి రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. దీంతో నాగరాజు అసలు బండారం బయటపడింది.
బంధువులతో కలిసి అతని పై దాడి చేసింది. ఈ విషయం పై మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా నాగరాజు తనను వదిలించుకోవాలని తనను, కూతురిని హత్య చేయడానికి పథకం పన్నాడని అమూల్య పోలీసులకు తెలిపింది. తన భర్తతో ప్రాణహాని ఉందని, తన భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేసింది. కొద్ది రోజుల క్రితమే సాప్ట్ వేర్ భార్య ఎఫైర్ తో భర్త సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో వివాహేతర సంబంధాలు బయటపడుతుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమూల్య తన భర్తను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న వీడియోలు కింద ఉన్నాయి చూడండి.