ఈ రోజు నెల్లూరు రూరల్ లో ఏమిజరిగిందో తెలుసా?

ఈ ఉదయం  10 గంటలకు పబ్లిక్ హెల్త్ అధికారులను, మీడియాను తీసుకుని ప్రత్యేక వాహనాల్లో  రూల్ మ్మెల్యలే కోటం రెడ్డ శ్రీధర్ రెడ్డి భక్త వత్సల నగర్ కి వచ్చారు. ఆ ప్రాంతంలో  సిమెంట్ రోడ్డు వేసి నెల రోజులే అయింది. అయితే నెలలోనే రోడ్డంగా పగుళ్లిచ్చింది. ఇక వర్షం వస్తే మొత్తం కొట్టుకు పోతుంది. ఈ రోడ్లని శ్రీధర్ రెడ్డి అధికారులకు,  మీడియా కు చూపించారు. ఇదే మిటని ప్రశ్నించారు.

 

పగుళ్లిచ్చిన మాట వాస్తవమే నని, వెంటనే కొత్త రోడ్లు వేయిస్తామని, అప్పటి దాకా కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేస్తామని అధికారులు ఎమ్మెల్యేలకు   హా మీ ఇచ్చారు. ఈ సందర్భంగా అత్యంత నాసిరకంగా అధ్వాన్నంగా రోడ్ల నిర్మాణం సాగిస్తున్నారని ఆప్రాంత ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సిమెంట్ రోడ్ ను నీళ్లతో క్యూరింగ్ కూడా చేయడం లేదని సాఫ్ట్ వైబ్రేటర్ ఉపయోగించడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.  ఈసమయంలో అధికారులు జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లకు వత్తాసుగా మాట్లాడుతూ స్థానిక ప్రజల మీదే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కోటంరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. కళ్ల ముందున్న యదార్థానికి సమాధానం చెప్పకుండా అధికారులు ప్రజల మీద కోపం చూపించడానికి అభ్యంతరం తెలిపారు. దీనికి నిరసనగా రోడ్డు మీద భైఠాయించారు. జరుగుతున్న వాస్తవాన్ని  వెల్లడిచేసిన స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని , అధికారులను కదలనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. స్థానిక అధికారులు పై అధికారులకు ఎమ్మెల్యే ధర్నా గురించి తెలియ చెప్పడంతో పబ్లిక్ హెల్త్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. తాను వూర్లో లేనని, ఒంగోలులో ఉన్నానని, రేపుఉదయం నెల్లూరు కు వచ్చి రోడ్ల పగుళ్లను పరిశీలిస్తానని, చెబుతు కొత్త రోడ్డు వేయిస్తానని కూడా హామీ ఇచ్చారు. సంబంధిత కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుంటానని కూడా  హామీ ఇచ్చారు. దీనితో  ఎస్ ఇ మాటలను విశ్వసించి ఎమ్మెల్యే నడిరోడ్డు ధర్నా విరమించుకున్నారు.