ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 2 వ తేదీన భార్య భారతితో కలిసి ప్రయాణమై వెళ్లిన ఆయన… ఈ నెల 12 తిరుగు ప్రయాణమై రాబోతున్నారు. ఈ క్రమంలో ఆ పర్యటనను పూర్తి వ్యక్తిగత ట్రిప్ గా జాగ్త్రత్తలు తీసుకున్న ఆయన… వచ్చిన తర్వాత మాత్రం గేర్ మార్చబోతున్నారని తెలుస్తుంది.
లండన్ ఫ్యామిలీ ట్రిప్ ను పూర్తి వ్యక్తిగతంగా ప్లాన్ చేసుకున్నారు జగన్. ఇందులో భాగంగా ఎక్కడా రాజకీయ భేటీలకు ఛాన్స్ లేకుండా చూసుకున్నారు. అయితే తిరిగి ఏపీకి వచ్చిన తర్వాత మాత్రం సంచలన కార్యక్రమాలు చేయబోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా… వైనాట్ 175 ని మరింత బలంగా తీసుకెళ్లాలని ఫిక్సవుతున్నారు.
లండన్ పర్యటన అనంతరం ఎమ్మెల్యేలు మంత్రులతో జగన్ భేటీ కానున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని సరిగా నిర్వహించనివారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోనని ప్రకటించిన మాటకు కార్యరూపం తేబోతున్నారని అంటున్నారు. సరిగా కార్యక్రమం నిర్వహించనివారి పేర్లను జగన్ పలుమార్లు చదివి వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే వారిలో కొంతమంది ఇప్పటికే రెక్టిఫై చేసుకోగా… మరికొంతమంది మాత్రం కొత్త సాకులు నెతుక్కునే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లండన్ నుంచి రాగానే… పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచుతారని చెబుతున్నారు. అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారిస్తారని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు అయిన… ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్థానాల్లో కొత్త అభ్యర్థులను జగన్ ప్రకటించారు. ఇదే సమయంలో లండన్ నుంచి వచ్చాక ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, బలహీనమైన అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో సెప్టెంబర్ 15న మంత్రివర్గ సమావేశం, 20 వతేదీ నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని.. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఈ లెక్కన చిన్న గ్య్యాప్ తీసుకుని.. జగన్ గేర్ మార్చే ఛాన్స్ ఉందన్న మాట.