అనిల్ కుమార్ యాదవ్ కి గుడ్ న్యూస్… చెబుతున్నది నెల్లూరు టీడీపీ నేతలు!

ఎంతమంది పార్టీలు మారినా.. మరెంత మంది ఇతరపార్టీలనుంచి వచ్చి చేరినా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రం టీడీపీ పరిస్థితి మారడం లేదన్ని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా మరిముఖ్యంగా నెల్లూరు సిటీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు వరుసపెట్టి గుడ్ న్యూస్ ల్లు చెబుతున్నారని అంటున్నారు.

అవును… ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా… సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ రీ ఎంట్రీ ఇవ్వడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. ఫలితంగా.. ఇంతకాలం కేడర్ ని కాపాడుకుంటూ పనిచేసిన నాయకులు ఫైరవుతున్నారంట.

మాజీ మంత్రి నారాయణ రీ ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి దాకా ఇన్చార్జిగా పనిచేసిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం పక్కన పెట్టేసింది. దీంతో ఆయన ఫుల్ గా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. నారాయణ వస్తే ఆయనకే సీటు ఇచ్చేస్తారనే విషయం తెలిసినప్పుడు… తనను ఇంతకాలం ఎందుకు బలిపశువుని చేశారు అని ఆయన అధిష్టాణంపై ఫైరవుతున్నారంట.

దీనికి తోడు లోకేష్ పాదయాత్రలో కూడా ఆయనను పట్టించుకోకపోవడంతో శ్రీనివాసులురెడ్డి పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారని అంటున్నారు. దీంతో కేడర్ వద్ద బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లబుచ్చుతున్నారని అంటున్నారు. ఫలితంగా… రాబోయే రోజుల్లో నారాయణకు వ్యతిరేకంగా తెరవెనుక రాజకీయం నడిపినా ఆశ్చర్యం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో… ఇక మాజీ మంత్రి నారాయణ వ్యవహార శైలిపై జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ కూడా సీరియస్‌ గా ఉన్నారని తెలుస్తుంది. అజీజ్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటుని ఆశిస్తున్నారనేది తెలిసిన విషయమే. అయితే… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి మాజీమంత్రి నారాయణ తన గొంతు కోశారని అనుచరుల వద్ద అజీజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

అదేవిధంగా… కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే ముందు కూడా కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని ఆయన వాపోతున్నారంట. ఈ విషయంలో కావాలనే నారాయణ తనను వెన్నుపోటు పొడిచాడని మండిపడుతున్నారట అజీజ్. దీంతో… నెల్లూరు సిటీ, రూరల్‌ లో తనకు ఉన్న ఓటు బ్యాంక్‌ తో నారాయణను, కోటంరెడ్డిని ఓడిస్తానని అజీజ్ ఆఫ్ ద రికార్డ్ సన్నిహితుల వద్ద శపథం చేస్తున్నారని తెలుస్తుంది.

దీంతో నెల్లూరు సిటీలో బలమైన నేతగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కి ఈ రకంగా టీడీపీ నేతలు గుడ్ న్యూస్ లు చెబుతున్నారని అంటున్నారట స్థానిక ప్రజానికం. నారాయణను మళ్లీ తీసుకొచ్చినప్పుడే అనిల్ కి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పగా… కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అజీజ్ ల వ్యవహారంతో మరో భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లేనని అంటున్నారు పరిశీలకులు.